బీహార్‌ లో అతి పెద్ద పార్టీగా బీజేపీ.. అధికారం సాధ్యమే!

Update: 2020-11-10 16:32 GMT
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తిగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా బీజేపీ-జేడీయూ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్తానాలు ఉండగా.. ఎన్డీఏ కూటమికి 125 సీట్లలో ఆధిక్యం/ గెలుపు ఖాయమైంది.

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 126 స్థానాల్లో ఆధిక్యం/ గెలుపుతో ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్ మహాకూటమి 106 స్థానాల్లో ఆధిక్యం/ గెలుపుతో ఉంది.

బీహార్ ఎన్నికల్లో బీజేపీ 73 సీట్లు సాధించేలా కనిపిస్తోంది. పోయిన సారి కంటే 20 సీట్లు అదనంగా పెంచుకుంటోంది. అదేసమయంలో జేడీయూ 24 సీట్లు కోల్పోయి 47సీట్లకే పరిమితం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నితీష్ పాలన నచ్చకే జేడీయూని ప్రజలు వ్యతిరేకించారని.. అదేసమయంలో బీజేపీ పాలన నచ్చిందని ఈ తీర్పు ద్వారా తేటతెల్లమవుతోంది.

దాదాపు 40 శాతం సీట్లను కోల్పోయిన పార్టీ నుంచి నితీశ్‌కి బీజేపీ మళ్లీ అవకాశం ఇస్తే... ప్రజల్లో అసంతృప్తి ఏర్పడే అవకాశాలు ఉండొచ్చు. ఐతే... తమకు సీఎం ఛాన్స్ ఇవ్వకపోతే... కూటమి నుంచి తొలగుతామని జేడీయూ షరతు పెట్టినా పెట్టొచ్చు. ఐతే... సీట్లు తగ్గాయి కాబట్టి... ఆ పార్టీ అంతలా పట్టుపడుతుందా అన్నది చూడాలి.

 బీహార్ లో మళ్లీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంతో సీఎం ఎవరు అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకైతే బీజేపీ సీఎం అంశంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠకు గురిచేస్తోంది.

ప్రచారంలో అయితే మోడీ తమ కూటమి అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ సీఎం అవుతాడని  ప్రకటించారు. కానీ జేడీయూకు మరీ సీట్లు బాగా తగ్గడం.. బీజేపీకి భారీగా పెరగడంతో బీహార్ బీజేపీ నుంచి ఒత్తిడి పెరిగి బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి పుట్టుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News