పెళ్లిచూపుల్లో సెక్స్ అనుభవం అడగాలంట.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు

Update: 2020-03-20 07:10 GMT
రాజకీయ నాయకులు మతి ఉండి మాట్లాడతారో.. లేక మాట్లాడతారో గానీ వారు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే వారి పరువుతో పాటు సమాజంలో కొంత దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులు మాట్లాడే ముందు కొంత ఆలోచించాలి. అలా చేయకుండా ఎట్ల పడితే అలా మాట్లాడితే వారే చిక్కుల్లో పడుతారు. తాజాగా కర్నాటకకు చెందిన ఓ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా శాసనమండలిలోనే అసభ్యంగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.

ఉద్యోగం ఇచ్చేటపుడు ఏమి అనుభవం ఉందని అడిగేవారు, పెళ్లిచూపుల్లో అబ్బాయికి ఏమి అనుభవం ఉందని ఎందుకు అడగరు? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం ప్రశ్నించారు. కర్నాటకలో ప్రస్తుతం విధాన పరిషత్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన సభలో ఓ అంశంపై ఎమ్మెల్సీ ఇబ్రహీం మాట్లాడుతూ.. ఉద్యోగం కోసం వెళ్తే ఏమి అనుభవం ఉందని ఇంటర్వ్యూలో అడుగుతారని.. అదే మాదిరి పెళ్లిచూపుల సమయంలో అబ్బాయికి సెక్స్ అనుభవం ఉందా లేదా అని అడగరా అని ఆయన ప్రశ్నించారు. తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. నిండు సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళలకు అవమానకరమని బీజేపీ, జేడీఎస్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా మండి పడుతున్నారు. ఇబ్రహీం ఆడ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు పిల్లాడికి అనుభవాన్ని అడిగారా? అని ప్రశ్నించారు.

ఇబ్రహీం క్షమాపణ చెప్పాలని విధాన పరిషత్ బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఇబ్రహీం పట్టించుకోకుండా చర్చను కొనసాగిస్తుండగా వారు బైకాట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఇబ్రహీం ఆ మాటను మాట్లాడకుండా ఉండాల్సిందని చైర్ పర్సన్ తెలపడంతో.. ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించడంతో ఇబ్రహీం తన మాటలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. దీంతో వివాదం సమసిపోయింది. అయితే అప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో వైరలైంది. దీనిపై కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా మాట్లాడుతుండగా.. మరికొందరు అతడి ప్రవర్తనను, మాటలపై విమర్శలు చేస్తున్నారు.
Tags:    

Similar News