అమెరికా వైఖరి వల్లే భారత్ - బ్రెజిల్ కు వైరస్

Update: 2020-06-26 08:10 GMT
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఇదివరకు తగ్గిన ప్రాంతాల్లో వైరస్ తుడుచిపెట్టుకుపోయిందని భావించారు. కానీ మళ్లీ ఆయా ప్రాంతాల్లో వైరస్ ప్రబలడం ఆ దేశాన్ని వణికిస్తోంది.

కరోనాను నియంత్రించడంలో ఆది నుంచి అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ పెట్టకుండా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కరోనా వైరస్ ప్రబలుతుండడంతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో అమెరికా ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అమెరికాలో మరణిస్తున్న వారి సంఖ్యే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు.  

అమెరికా ప్రభుత్వం టెస్టింగ్ లు సరిగా చేయడం లేదని.. కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం లేదని బిల్ గేట్స్ ఆరోపించారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించడంలో అమెరికా విఫలమైనట్లు పేర్కొన్నారు.

అమెరికా వైఖరి వల్లే భారత్, బ్రెజిల్ లాంటి దేశాల్లో వైరస్ జోరందుకున్నట్టు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News