ఇదేం కూట‌మి స్వామీ.. నితీష్ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్ల ఫైర్‌

Update: 2022-09-25 15:44 GMT
దేశంలో ఉన్న కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం థర్డ్ ఫ్రంట్ లేదని.. కాంగ్రెస్తో కలిసి ఒకటే కూటమిగా ఏర్పడితే 2024 ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని నీతీశ్ అన్నారు. కాంగ్రెస్‌, లెఫ్ట్ సహా అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావాలని  కోరారు. అలా ప్రతిపక్షాలన్నీ ఏకమైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.

తాను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిని కానని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ అనే ప్రశ్నే లేదని.. కాంగ్రెస్తో సహా ఒక ఫ్రంట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పార్టీలు లేకుండా కూటమిని ఊహించలేమని నీతీశ్ అన్నారు. మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతిని పురస్కరించుకుని హరియాణాలోని ఫతేహాబాద్లో ఐఎన్ఎల్డీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఇతర విపక్ష నేతలతో కలిసి పాల్గొన్న నీతీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ర్యాలీని బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యతకు తొలి అడుగుగా అభివర్ణించారు నీతీశ్ కుమార్. ప్రస్తుతానికి అన్ని ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన ఫ్రంట్ అవసరమని.. థర్డ్ ఫ్రంట్ కాదని అభిప్రాయపడ్డారు. బిహార్‌లో ఏడు పార్టీలు కలిసి ఉన్నాయని.. బీజేపీ ఒంటరిగా ఉందని అన్నారు. 2025 బిహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలవదని జోస్యం చెప్పారు నితీశ్.

``బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే భాజపాను ఓడించవచ్చు. రాజకీయంగా లబ్ది పొందేందుకే బీజేపీ హిందూ-ముస్లింల మధ్య వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అసలు ఈ రెండు వర్గాలు మధ్య విభేదాలు లేవు. 1947లో దేశ విభజన అనంతరం ఎక్కువ సంఖ్యలో ముస్లింలు భారత్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు`` అని నితీష్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News