పబ్ లో రాహుల్ సిప్లిగంజ్ పై దాడి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడి హస్తం
పబ్ లో జరిగిన ఘర్షణలో బిగ్ బాస్ సీజన్ 3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాల దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాహూల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఒక్క సారిగా సినీ పరిశ్రమ లో కలకలం రేగింది. రాహూల్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పబ్ కు రాత్రి 11.45 సమయంలో తన స్నేహితురాలితో రాహూల్ వచ్చాడు. రాహుల్ వెంట పబ్ కి వచ్చిన అమ్మాయి పట్ల కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. ఆ యువకులను రాహుల్ నిలదీయడంతో వాగ్వాదం ఏర్పడింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి దాడులకు దారి తీసింది. దీంతో క్షణికావేశంలో యువకులు బీరు సీసాలతో రాహుల్ పై దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే రాహుల్ పై దాడి చేసిన వారిలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులు కూడా ఉన్నారని సమాచారం.
అయితే దాడి చేసిన వారిలో టీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే సోదరుడి తో పాటు వారి సంబంధికులు ఉన్నారని తెలుస్తోంది. దాడికి గురైనా రాహుల్ ఆస్పత్రిలో ఫిర్యాదు చేయలేదు. గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఆ వెంటనే ఇంటికి వెళ్లిపోయాడు. అయితే సకాలంలో పోలీసులు స్పందించడంతో గొడవ సద్దుమణిగింది. రాహులే తమను వేధించాడని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంబంధికులు ఆరోపిస్తున్నారు. రాహూల్ దురుసు గా ప్రవర్తించాడని అతడి వైఖరి వలనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.