నేను భారత్‌కు వీరాభిమానిని అంటూనే.. డ్రాగన్ అంతరంగాన్ని చెప్పేసిన.. చైనా నేత!
చైనా దౌత్య వేత్త ఒకరు.. భారత్‌పై చాలా లోపాయికారీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. పాకిస్తాన్, చైనాలను పరోక్షంగా హెచ్చరిస్తూ.. భారత్ యుద్ధాన్ని కోరుకోదని.. కానీ, ఆ పరిస్థితి వస్తే.. అరవీర భయంకరంగా.. భారత్ తన సత్తాను చాటు తుందని హెచ్చరించారు. పైగా.. మోడీ .. ఈ వ్యాఖ్యలు.. నేరుగా యుద్ధభూమి కార్గిల్‌కు వెళ్లి మరీ చేయడం.. ఆసక్తిగా మారింది. ఈ పరిణామాలతో చైనాకు చెందిన కీలక అధికారి.. బంగ్లాదేశ్‌లో చైనా దౌత్య వేత్తగా ఉన్న లి. జిమింగ్ భారత్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
‘నేను భారత్‌కు వీరాభిమానిని...’ అంటూ చైనా విదేశాంగశాఖ ఉన్నతాధికారి లి. జిమింగ్ వెల్లడించారు. అలాగే తమకు భారత్‌తో ఎటువంటి వ్యూహాత్మక శత్రుత్వం లేదని ఆయన తెలిపారు. ‘భారత్‌ను చైనాకు వ్యూహాత్మక శత్రువుగా లేక పోటీదారుగా మేము ఎన్నడూ చూడలేదు. వ్యక్తిగతంగా నేను భారత్‌కు పెద్ద అభిమానిని. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి మేం మరింత సన్నిహితంగా పనిచేస్తాం`` అన్నారు.
అయితే.. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే కీలక కామెంట్ చేశాడు. లి.జిమింగ్.. ``బంగాళాఖాతం వద్ద భారీగా ఆయుధ మోహరింపులను చైనా కోరుకోవడం లేదు’ అన్నాడు. అంటే.. మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే లి. జిమింగ్ ఇలా వ్యాఖ్యానించాడనేది.. స్పష్టంగా తెలుస్తోంది. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి పరోక్షంగా స్పందించారు. దక్షిణాసియా దేశాలు.. ఐరోపాలోని దేశాల వలే వ్యవహరించకూడదని చైనా కోరుకుంటోందన్నారు.
‘ప్రాంతీయంగా నెలకొన్న సమస్యలను ఆసియా విధానంలో పరిష్కరించుకోవాలని విశ్వసిస్తున్నాం. ఐరోపా, దక్షిణ అమెరికా విధానాల్లో కాదు’ అని చైనా వైఖరిని వెల్లడించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, ఢిల్లీలోని చైనా దౌత్యవేత్త సన్ విడాంగ్ మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. భారత్, చైనా మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడాలంటే సరిహద్దు వద్ద ప్రశాంత వాతావరణం అవసరమని జై శంకర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇరువైపులా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ పరిణామాలు ఇలా.. ఉంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చైనా రష్యాకు మద్దతు ఇస్తోంది. కానీ, భారత్ మాత్రం తటస్థంగా ఉంటోంది. దీంతో ప్రపంచ దేశాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇ ది కూడా.. చైనాకు కంటగింపుగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.