హైదరాబాద్ ఎంత ప్రమాదకరమంటే....
గుండెపోటు..ఇంగ్లిష్‌లో హార్ట్ ఎటాక్ ఈ పదం ఈ మధ్య కాలంలో చాలా తరచుగా వింటున్నాం. అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలో అవి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ది బిగ్ బీపీ సర్వే సంస్థ చేసిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించారు.
విద్యుత్ సరఫరాలో కొన్ని సార్లు హై వోల్టేజి ఏర్పడినపుడు ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలైన టీవీలు - ఫ్రిజ్ లు - కంప్యూటర్లు తదితర వస్తువులు పేలిపోతాయి. లేదా వాటిలో ఉన్న ఐసీ చిప్స్ పాడైయి ఆ వస్తువులు పనిచేయవు. అలాగే మనిషి శరీరంలో రక్తపోటు అధికమై తారాస్థాయికి చేరితే శరీరంలోని ప్రధాన అవయవాలు కూడా అధిక రక్తపోటు ప్రభావానికి గురై పేలిపోతాయి. అంటే అవి పనిచేయకుండా ఫెయిల్ అవుతాయన్నమాట. ముఖ్యంగా మెడడు - గుండె - కిడ్నీలు - కళ్లపై రక్తపోటు ప్రభావం ఉంటుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. సకాలంలో రక్తపోటును గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోయినట్లే శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయడం మానేస్తాయి. మనిషి శరీరంలోని అవయవాలు ఫెయిల్ అయితే అవయవ మార్పిడి చాలా ఖర్చుతో కూడుకున్నదని, క్లిష్టమైనదని చెప్తున్నారు. కొన్ని సార్లు అవయవ మార్పిడి చేసిన రోగులు బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పారు.
అధిక రక్తపోటు వల్ల కలిగే ప్రభావాలతో దేశవ్యాప్తంగా నిమిషానికి ఐదు మంది మృత్యువాత పడుతున్నట్లు రక్తపోటు నిపుణులు డా.రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు ఆయన తెలిపారు. దేశంలో అధిక రక్తపోటుతో ఏటా 2.5మిలియన్ల మంది రోగులు మృత్యువాత పడుతున్నట్లు వెల్లడించారు. ది బిగ్ బీపీ సర్వే సంస్థ అధినేత, అపోలో దవాఖాన కార్డియాలజిస్టు విభాగం అధిపతి డా.శివ్ కుమార్ మాట్లాడుతూ దేశ జనాభాలో చిన్నా, పెద్దా తేడా లేకుండా మూడోవంతు మంది అధిక రక్తపోటుకు గురవుతున్నారని, వీరిలో చాలా మందికి అసలు అధిక రక్తపోటు ఉన్న విషయమే తెలియకపోవడం విచారకరమన్నారు. నగరంలో 36 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని తమ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైనట్లు డా.శివ్ కుమార్ తెలిపారు. సో...మనమంతా టెన్షన్ లకు దూరంగా ఉండటమే కాదు....రిలాక్స్ గా ఉంటూ బీపీకి నో చెప్పాల్సిందే.