జానారెడ్డి పార్టీ మార్పుపై భట్టి స్పందన

Update: 2020-12-05 13:24 GMT
కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి అనూహ్యంగా బీజేపీలో చేరనున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ లో కురువృద్ధుడు.. కొన్ని ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న ఆయన పార్టీ మార్పుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘జానారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. కాంగ్రెస్ ని బలహీన పరచాలనే కుట్రదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని’ విమర్శించారు. పీసీసీ ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపారు. పార్టీ నాయకులతో కేవలం పార్టీని బతికించడం ఎలా అనే దానిపైనే చర్చించామన్నారు.

బీజేపీ, ఎంఐఎం మతాన్ని రెచ్చగొట్టాయని.. టీఆర్ఎస్ కూడా సామాన్య ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రమాదంలో నగరం ఉందని రెచ్చగొట్టాయని భట్టి మండిపడ్డారు. ఆ పార్టీలు భావోద్వేగాలతో ఎన్నికల్లో లబ్ధి పొందాయని.. భావోద్వేగంతో ఓట్లు పొందవచ్చు కానీ అభివృద్ధి సంక్షేమానికి సమాధానం కాదని తెలిపారు.

ఓటమిపై నాయకులంతా కలిసి సమీక్ష చేసుకుంటామని భట్టి తెలిపారు.కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందవద్దని.. ఎంఐఎంతో ఎప్పుడు రాజకీయ పరమైన పొత్తు పెట్టుకోలేదని పేర్కొన్నారు.
Tags:    

Similar News