వైద్యులకు మండింది.. ప్రధానినే అడ్డగించారు..
కనిపించని వైరస్ మానవ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ సమయంలో ప్రజలను రక్షిస్తున్నది కేవలం వైద్యులే. అలాంటి వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు, పరికరాలు, వస్తువులు అందుబాటులో ఉంచాలి. అలాంటి బ్రెజిల్‌లో వైద్యులకు సక్రమంగా అందించడం లేదు. కనీసం తమను గుర్తించడం లేదని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆస్పత్రి సందర్శనకు వచ్చిన ప్రధానమంత్రిని అడ్డగించి ఆయన ఎదుటే ఆందోళన చేశారు. ఈ సంఘటన బెల్జియం రాజధాని బ్రెస్సెల్స్‌లో జరిగింది.
బెల్జియం ప్రధానమంత్రి సోఫీ విల్మ్స్ బ్రస్సెల్స్‌లోని సెయింట్ పీటర్ ఆస్పత్రిని సందర్శించడానికి వచ్చారు. అక్కడి వైద్యులతో సహా సిబ్బంది రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు నిల్చుని ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి రాగానే ఎప్పటి నుంచో అసహనంతో ఉన్న వారంతా నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రధాని విల్మ్స్‌కు వీపు చూపిస్తూ నిరసన తెలిపారు. బడ్జెట్‌లో తగినంతగా నిధులు కేటాయించకపోవడం, వేతనాల్లో కోత తదితర కారణాలతో వైద్యులు ఆందోళన చేశారు. ఇక అర్హతలు లేనివారిని ప్రభుత్వం నర్సులుగా నియమించడాన్ని తప్పుబడుతూ నిరసన చేట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే ఇలా వినూత్నంగా నిరసన తెలిపినట్లు అక్కడి వైద్యులు, సిబ్బంది చెప్పారు.