మహిళలు బికినీలు మాత్రమే వేసుకోవాలా ?

Update: 2021-10-02 06:31 GMT
బీచ్ హ్యాండ్ బాల్ గేమ్ లో అమ్మాయిలు బికినీలు మాత్రమే వేసుకోవాలనే రూల్ తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ఈ నిబంధన ను రివ్యూ చేయాలని హ్యాండ్ బాల్ అసోసియేషన్ ను 5 దేశాలు కోరాయి. బల్గేరియాలోని వర్నాలో యూరోపియన్ బీచ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ జరిగింది. టోర్నీలో భాగంగా స్పెయిన్‌ తో జరిగిన మ్యాచ్‌ లో నార్వే మహిళల హ్యాండ్ బాల్ జట్టు.. రూల్స్ కు వ్యతిరేకంగా బికినీ స్థానంలో షార్ట్స్ ధరించి బరిలో దిగారు.

దీంతో సదరు టీమ్ పై ఆగ్రహించిన యూరోపియన్ హ్యాండ్ బాల్ సమాఖ్య భారీ జరిమానా విధించింది. 1500 యూరోలు పరిహారంగా కట్టాలని ఆదేశించింది. భారత కరెన్సీలో ఒక లక్ష్య 31 వేలు. అంతర్జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య నిబంధనల ప్రకారం మహిళా అథ్లెట్లు తప్పనిసరిగా బాటమ్ బికినీ ధరించాలి. సైడ్స్ లో బికినీ సైజ్ నాలుగు అంగుళాలను మించకూడదు. అదే విధంగా పురుష అథ్లెట్లు మోకాలికి నాలుగు అంగుళాల పైకి షార్ట్స్ వేసుకునే వెసులుబాటు ఉంది.

అయితే , తమ జట్టు క్రీడాకారిణులు తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు నార్వే హ్యాండ్బాల్ ఫెడరేషన్ (ఎన్హెచ్ఎఫ్) సోషల్మీడియాలో ప్రకటించింది. ఈ వివాదాస్పద నిబంధన గురించి 2006లో ఫిర్యాదు చేసి.. ఆ రూల్ మార్చేందుకు తామెంతో కృషి చేస్తున్నట్లు తెలిపింది. అథ్లెట్లకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులను ధరించడంలో తప్పేముందని, మార్పు తెచ్చేందుకే మహిళా అథ్లెట్లు ఆ నిర్ణయానికి వచ్చారని స్పష్టం చేసింది. ఈహెచ్‌ ఎఫ్‌ అనవసర రాద్దాంతం చేస్తుందని పేర్కొంది. ఈ విషయంలో తాము ప్లేయర్స్‌ కు మద్దతుగా నిలుస్తామని, అలాగే వారికి విధించిన జరిమానాను తామే చెల్లిస్తామని అప్పట్లో స్పష్టం చేసింది. పురుష అథ్లెట్లు మోకాలికి నాలుగు అంగుళాల పైకి షార్ట్స్ వేసుకునే వెసులుబా ఇచ్చి అమ్మాయిలకి బికినీలు మాత్రమే వేసుకోవాలనే రూల్ ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.



Tags:    

Similar News