• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీమిండియా ఆటగాళ్ల మెనూ.....

టీమిండియా ఆటగాళ్ల మెనూ.. మరోసారి చర్చనీయాంశమాయెను

By - Tupaki Desk
Update: 2021-11-25 01:30 GMT
భారత్ వంటి దేశంలో క్రికెట్ కంటే పెద్ద మతం ఏమీ ఉండదు.. అందుకే క్రికెటర్లు ఏం తింటారు? ఏం తాగుతారు? అనేవి ఎప్పుడూ ఆసక్తికర విషయాలే.. గతంలో టీమిండియా విదేశీ పర్యటనలో తీవ్ర వైఫల్యం చెందిన సందర్భంలో ఆటగాళ్ల డైట్ విషయం చర్చకు వచ్చింది. సరైన ఆహారం లేని కారణంగానే మంచి ప్రదర్శన చేయలేకపోయారన్న వార్తలు వచ్చాయి. అయితే, వ్యక్తిగతంగా ఏ ఆటగాడూ దీనిని ప్రకటించలేదు.

అధికారికంగా బీసీసీఐ కూడా ఏమీ చెప్పలేదు. దీంతో అదొక ప్రచారం గానే మిగిలిపోయింది. కాగా, ఆహారం, ఆహార్యం ఎలా ఉన్నా.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు మైదానంలోకి దిగాక గెలుపు మాత్రమే లక్ష్యం కావాలి. కారణాలు చెబితే పిల్ల చేష్టగా ఉంటుంది. అందుకనే ఆటగాళ్లెవరూ నాటి విదేశీ పర్యటనలో తమకు ఎదురైన అనుభవాన్ని చెప్పలేదు.

కివీస్ తో సిరీస్ కు ముందు ఇప్పడు

గురువారం నుంచి న్యూజిలాండ్ తో టీమిండియా 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల మెనూ పై వివాదం నెలకొంది. దీనిపై బీసీసీఐ జోక్యం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. శాకాహారం, మాంసాహారం అంటూ ఆంక్షలు విధిస్తున్నారని తెలిసింది. అయితే, తామేమీ అలా చేయడం లేదని సంస్థ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఆటగాళ్లు వారికి ఇష్టమైనది తినవచ్చని, అది శాకాహారామా? మాంసాహారమా? అన్నది అప్రస్తుతమని తెలిపారు.

ఆ రెండు మాంసాలను నిషేధించారా?

గురువారం తొలి టెస్టు జరుగనున్నది ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కాగా.. ఆ సందర్భంగా ఆటగాళ్ల మెనూలో పంది, ఆవు మాంసాన్ని నిషేధించారని, కేవలం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే అందించనున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో వ్యక్తిగత విషయమైన ప్లేయర్ల ఆహార అలవాట్లపై జోక్యం ఏమిటంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. భారత్ తో పాటు న్యూజిలాండ్ జట్టులోనూ ముస్లిం ఆటగాళ్లు ఉండడంతో హలాల్ చేసిన ఆహారం అందించాలని బీసీసీఐ భావించినట్లు సమాచారం.

మీకు తెలుసా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంతటి ఫిట్నెస్ ఫ్రీక్ అనేది అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తాను తీసుకునే ఆహారం విషయంలోనూ కోహ్లి చాలా శ్రద్ధ వహిస్తాడు. అతడు తాగే నీటి విలువ భారత కరెన్సీలో లీటరు రూ.400పైనే కావడం విశేషం. మిగతా ఆహారం విషయంలోనూ కోహ్లి చూపే జాగ్రత్త అతడి ఫిట్నెస్ రహస్యంగా అందరూ చెప్పుకొంటారు.


Tags:    
  • BCCI 
  • latestnews 
  • laterst updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

అమెరికా ఆహారపు అలవాట్లలో మార్పులు.. కొత్త ఫుడ్ పిరమిడ్‌లో ఏయే ఆహారాలకు చోటు?

2026-11-12 23:30 GMT

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

నారా లోకేష్‌ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..

2026-11-12 18:27 GMT

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

2026-11-12 18:25 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం.. Nvidiaలో ఏం జరగబోతోంది?

2026-11-12 18:19 GMT

కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!

2026-11-12 18:17 GMT

Copyright @2026

Powered by Blink CMS