బెంగళూరు కామాంధుడ్ని అరెస్ట్ చేశారు

Update: 2016-05-03 09:46 GMT
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన బెంగళూరు కిడ్నాప్ ఉదంతంలో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు సౌత్ లో తాను పేయింగ్ గెస్ట్ గా ఉంటున్న ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతున్న మణిపూర్ కు చెందిన యువతిని వెనుక నుంచి వచ్చిన ఒక ఆగంతుకుడు.. బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచార యత్నం చేసిన ఉదంతం తెలిసిందే.

ఆమెను ఎత్తుకెళుతున్న ఎవరూ అడ్డుకోకపోవటం.. ఆ దుండగుడు నుంచి సదరు బాధితురాలు పోరాడి తప్పించుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు రావటంతో జరిగిన దారుణం బయటకు వచ్చింది. సీసీ ఫుటేజ్ తో పాటు.. బాధితురాలు స్థానిక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వటం.. అది దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా రావటం సంచలనంగా మారింది.

గత నెల 23న జరిగిన ఈ దారుణం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.  మీడియాలో వచ్చిన ఈ ఉదంతంపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు.  సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసు అధికారులు యువతిని కిడ్పాప్ చేసింది అక్షయ్ గా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు జరిగిన ఉదంతంపై విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అక్షయ్ వివరాల్ని తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు  చెబుతున్నారు.
Tags:    

Similar News