ఈ బెంగళూరుకు ఈరోజు ఏమైంది?

Update: 2020-07-05 09:47 GMT
ఆదివారం వచ్చిదంటే ఐటీ సిటీ బెంగళూరు కళకళలాడేది. ఆ ఒక్క సెలవు రోజు ఎంతో సందడిగా రోడ్లు, పార్క్ లు, సినిమాలు, రెస్టారెంట్లలో సందడి ఉండేది. ఆదివారం ట్రాఫిక్ బాగా ఉండేది. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు బెంగళూరు పూర్తిగా మారిపోయింది.

ఐటీ సిటీ, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు ఈ ఆదివారం బోసిపోయింది. కరోనా విపరీతంగా ప్రబలుతుండడం.. ఆదివారం సెలవు దినం రావడంతో జనాలంతా బెంగళూరును ఖాళీ చేశారు. ఉన్నవాళ్లంతా ఇంట్లోనే ఉండడంతో నగరం మొత్తం నిర్మానుష్యంగా మారింది.

బెంగళూరులో ఇప్పుడు జనాలు కేవలం నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి మాత్రమే బయటకు వస్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కర్ణాటక వ్యాప్తంగా ఇప్పటికే 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

దీంతో కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రతీ ఆదివారం బెగంళూరులో అత్యవసర సేవలు మినహా అన్ని బంద్. దీంతో ఈ ఆదివారం బెంగళూరు నిర్మానుష్యంగా మారింది.

    

Tags:    

Similar News