పవన్ కు లక్ష..బట్టలిప్పి చూపించాలా: బండ్ల
బండ్ల గణేష్ ఇప్పుడు మీడియాకు బంగారు బాతులా మారారు. ఆయన చేసే సీరియస్ కామెడీ వాటికి లక్షల వ్యూస్ ను తెచ్చిపెడుతోంది. పాపులర్ చేస్తోంది. బండ్లను కూర్చుండబెట్టి చర్చ పెడితే ఆయన చేసే సీరియస్ కూడా జనాలకు కామెడీగా కనపడుతోంది. కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేస్తున్నట్టు ‘బండ్ల అనే నేను’ అని డైలాగులు పేల్చిన బండ్ల ఆశలు నెరవేరలేదు.. ఇప్పుడు ఉన్నది పోయి.. ఉంచుకున్నది దక్కక పాపం బండ్ల ఎటూ కాకుండా పోయారు. పోటీ - పొత్తుల్లో తనకు టికెట్ రాలేదని బండ్ల వివరణ ఇస్తున్నాడు.
కాంగ్రెస్ టికెట్ దక్కని బండ్లను ఇప్పుడు పలు టీవీ చానెళ్లు ఇంటర్వ్యూలు చేస్తూ ఆయన్నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అసలు సిసలు రాజకీయ పండితుడి వలే బండ్ల మాత్రం ఎక్కడా దొరక్కుండా జర్నలిస్టులనే అదిలించి బెదిరించి తప్పించుకుంటున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఓ సినిమాలో మోసం చేశారట కదా అన్న ప్రశ్నకు బండ్ల ఫైర్ అయ్యారు. పవన్ తన దేవుడు అని.. ఆయన్ను మోసం చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే పవన్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చావంటే మాత్రం కేవలం లక్ష మాత్రమే ఇచ్చానని తప్పుడు సమాధానం చెప్పాడు. లక్షకు పవన్ చేస్తాడా.? మీరు దాస్తున్నారు.? గవర్నమెంట్ ను మోసం చేసి కోట్లు ఇచ్చారు.? టాక్స్ కట్టకుండా ఎగ్గొట్టారంటే.. బండ్ల సీరియస్ అయ్యారు. మా ఆస్తులు - సినిమాలు పర్సనల్ వ్యవహారాలని.. అవి వ్యాపారం చేసుకొనే వాళ్లకే తెలుసు అన్నారు. ప్రతి విషయాన్ని బట్టలిప్పి చూపించాలా.? మా బతుకు - సీక్రెట్ వ్యాపారాలు మాకుండవా అంటూ బండ్ల ఫైర్ అయ్యారు..
ఇక రవితేజను ఒక పొలం విషయంలో మోసం చేశారనే వార్తలపై కూడా బండ్ల దాటవేశారు. అదంతా ముగిసిపోయిందని.. తాము సెటిల్ చేసుకున్నామని వివరణ ఇచ్చారు. బండ్ల ఇలా మోసం చేసే కోట్లకు పడగలెత్తాడా అంటే ఉవ్వెత్తున లేశారు. తాను ఎవ్వరినీ మోసం చేయలేదని.. ప్రజల సొమ్ము తినలేదని.. కష్టపడి వ్యాపారం చేసుకొని పైకీ వచ్చామని బండ్ల చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో తెలుగు స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ - రవితేజ లను బండ్ల మోసం చేశాడనే విషయం మాత్రం కొత్తగా జనాలకు తెలిసివచ్చింది. దీనిపై బండ్ల సూటిగా సమాధానం చెప్పకపోవడంతో అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి.
Full View