బండ్ల గణేష్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా

Update: 2020-03-13 03:55 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిదంటే ఇదేనేమో.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆయన నెత్తిన కరోనా వైరస్ బండ భారీగానే పడింది. కరోనా ధాటికి బండ్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

నటుడు, నిర్మాతగా బండ్ల గణేష్ చాలా ఫేమస్. రాజకీయాల్లో చేరి ‘7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్న ఆయన డైలాగ్’ చాలా పాపులర్. అలాంటి బండ్ల రాజకీయాలు వదిలి సినిమాల బాట మళ్లీ పట్టారు. అయితే నటుడిగా, నిర్మాతగా బండ్ల గణేష్ ప్రధాన ఆదాయ వనరు పౌల్ట్రీ ఫామ్స్. తెలంగాణలో పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ బండ్ల గణేష్ కు ఉంది. బండ్ల కుటుంబం, సోదరుడు కలిసి తెలంగాణలోని హైదరాబాద్ చుట్టు పక్కల పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫామ్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణలోనే అత్యంత ఎక్కువ కోళ్లను, గుడ్లను ఉత్పత్తి చేసే సంస్థగా బండ్ల పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి.

ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కు బండ్ల గణేష్ కుదేలయ్యాడట.. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందన్న ప్రచారం బండ్ల గణేష్ వ్యాపారాలపై తీవ్రంగా పడింది. దీంతో చికెన్, గుడ్లు మార్కెట్లో పడిపోయాయి. వాటికి డిమాండ్ లేకపోవడంతో ఇప్పుడు బండ్ల గణేష్ పౌల్ట్రీ ఫామ్స్ లో కోళ్లు బరువు పెరిగి దాణా ఖర్చు పెరిగి భారీగా నష్టాలొస్తున్నాయట..

అందుకే తాజాగా కాపుకొచ్చిన 50వేల కోళ్లను పంపిణీ చేయడానికి బండ్ల గణేష్ రెడీ అయ్యారట..కోళ్లను కొనేవారు లేక పోవడంతో బండ్ల గణేష్ కు దాదాపు 10-20 లక్షల వరకూ నష్టం వస్తోందట.. సమీప గ్రామాల ప్రజలకు ఇప్పుడు ఉచితం గా కోళ్ల పంపిణీ కి బండ్ల రెడీ అయ్యారట.. పాపం కరోనా వైరస్ ఎఫెక్ట్ తో బండ్ల గణేష్ కు కూడా భారీగా బొక్క పడుతోందనే చెప్పాలి.
Tags:    

Similar News