చిరును బాలయ్య అలా అనేశాడే?

Update: 2016-02-24 16:17 GMT
ఇద్దరు ప్రముఖల మధ్య ఎన్ని పంచాయితీలు ఉన్నా ఒకరి మీద ఒకరు పెద్దగా మాట్లాడుకోవటం ఉండదు. ఇక.. చిరంజీవి.. బాలకృష్ణలు బాహాటంగా విమర్శలు చేసుకున్నది.. ఆరోపణలు చేసుకున్నది లేదు. అలాంటిది చిరు మీద బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మీడియా సమావేశంలో ఆసక్తిగా అడిగిన ఓ ప్రశ్నకు బాలయ్య నోటి నుంచి అలాంటి సమాధానం వస్తుందని ఎవరూ ఊహించని పరిస్థితి.

లేపాక్షి ఉత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు వచ్చిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి బాలయ్యను ఓ ప్రశ్న వేశారు. చంద్రబాబును ఉత్సహాలకు ఆహ్వానించారు సరే.. మరి చిరంజీవిని కూడా పిలుస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై బాలయ్య కాస్తంత ఘాటుగా రియాక్ట్ కావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సినీ పరిశ్రమలో ఎవరిని పిలవాలో వారినే పిలిచానని.. ఎవరిని పిలవాలో తనకు తెలుసన్న బాలయ్య.. తన పక్కన గ్లామర్ ఉన్నవారే ఉన్నారని.. తాను అలాంటి వారితోనే కలిసి ప్రయాణిస్తానని వ్యాఖ్యానించారు. తాను ఎవరిని నెత్తిన ఎక్కించుకోనని.. అలాంటి వారు ఉన్నారని అందుకే పిలవలేదని పేర్కొన్నారు. ఇంతకీ ఇన్నేసి మాటలు చిరును అనటంలో మర్మం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. డిక్టేటర్ లా తన స్టైల్లోనే తాను ఉంటానని వ్యాఖ్యానించారు.

ఇక.. సైకిల్ ఎక్కుతున్న జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు పార్టీలోకి వస్తున్నారని.. జగన్ దగ్గర తొత్తులుగా పని చేయలేకపోతున్నారన్నారు. ఓపక్క చిరు మీద వ్యాఖ్యలు.. మరోవైపు జగన్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో బాలకృష్ణ వ్యాఖ్యలు అద్యంతం ఆసక్తికరంగా ఉండటం గమనార్హం.

Full View
Tags:    

Similar News