హోదాపై బాలయ్య అభిమాని దీక్ష!

Update: 2016-08-06 11:47 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, లేదంటే ఫలితం అనుభవిస్తారని, తెలుగువాడి పౌరుషం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని కేంద్రంలోని బీజేపీని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరించిన నేపథ్యంలో.. ఆయన వీరాభిమాని ఒకరు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నిరసన తెలపడం మొదలుపెట్టారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన బాలయ్య వీరాభిమాని చింతకాయల రాంబాబు టెంటు వేసుకుని ఆమరణ దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించేవరకూ తాను దీక్ష విరమించేది లేదని ఆయన ప్రకటించారు.

కాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంతో ప్రస్తుతం ఏపీ మొదలు - ఢిల్లీ వరకూ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని కాంగ్రెస్ పార్టీ నేత - రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు పై చర్చ సందర్భంగా అది మనీ బిల్లనే సాకుతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ దెబ్బకొట్టిన నేపథ్యంలో ఏపీలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఇప్పటికే ఈ విషయమై వైకాపా తో సహా ఇతర పార్టీలు ఏపీ బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాలపై టీడీపీ - బీజేపీ - కాంగ్రెస్ - వైకాపా నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే - సినీ నటుడు బాలకృష్ణ ఏపీ ప్రత్యేక హోదాపై తనదైన స్టైల్లో స్పందించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News