• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్ కి షాక్ ఇచ్చే...

కేసీఆర్ కి షాక్ ఇచ్చే పనిలో బాబు.. అందుకే తెలంగాణాలో...?

By - Tupaki Desk
Update: 2022-10-17 11:31 GMT
చంద్రబాబు పరిస్థితులు బాగా లేనపుడు కొంత తగ్గుతారు. అంతమాత్రాన ఆయన ఏకంగా వెనకబడిపోయినట్లు కాదు. ప్రత్యర్ధులు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చంద్రబాబు మనస్తత్వం ఎపుడూ ఓటమిని అంగీకరించదు. అందుకే ఆయన మరోసారి తెలంగాణాలో టీడీపీని గట్టిగానే  లేపాలని చూస్తున్నారు. టీడీపీ పుట్టిన చోట పార్టీకి మంచి రోజులు తప్పకుండా వస్తాయని తీసుకురావాలని చంద్రబాబు బాగా  పట్టుదల మీద ఉన్నారు.

కేసీఆర్ బీయారెస్ ప్రకటన వల్ల జాతీయ స్థాయిలో ఆయనకు కొత్తగా ఏమి ఓరుగుతుందో తెలియదు కానీ ఆ ప్రకటన చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లు అయింది. దాంతో ఎన్నడూ లేని విధంగా బాబు తెలంగాణా టీడీపీ మీద ఫోకస్ ఫుల్ గా పెడుతున్నారు. తాజాగా జరిగిన తెలంగాణా పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు వారంలో అయిదు రోజులు తాను తెలంగాణా నేతలకు అందుబాటులో ఉంటాను అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇది నిజంగా చంద్రబాబులో వచ్చిన సరికొత్త మార్పుగా భావిస్తున్నారు.

ఏపీలో పార్టీ వ్యవహారాలకే చంద్రబాబు పరిమితమై తెలంగాణాలో వారంతంలో హైదరాబాద్ వచ్చినా తెలంగాణా పార్టీ నేతలను కూడా పట్టించుకోనంత బిజీగా ఒకపుడు బాబు ఉండేవారు. కానీ ఇపుడు ఆయనకు తెలంగాణాలో చాలా హోప్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు పార్టీ ఇక పరుగులు తీయాల్సిందే అని చెబుతున్నారు. అంతే కాదు తెలంగాణాలో తెలుగుదేశం చేసిన అభివృద్ధే ఇపుడు ఎక్కడ చూసినా ఉందని అంటున్నారు.

దానికి చెప్పుకోవడంలో  విఫలం కావడం వల్లనే నేతలు దూరం అయ్యారని, పార్టీ కూడా వెనకబడిందని అంటున్నారు. అదే టైం లో పార్టీలోకి కొత్త రకంగాన్ని యువ నేతలను తీసుకుని వస్తామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ కోసం ఎవరు వచ్చినా చేర్చుకోవాల్సిందే అని సీనియర్ నేతలకు బాబు సూచించారు. అంతే కాదు ఒక్కో కార్యకర్త పది మంది దాకా కార్యకర్తలను పార్టీలో చేర్పించాలని కొత్త టార్గెట్లు బాబు విధించారు.

తెలంగాణాలో పార్టీ విస్తరణకు ఇదే సమయం అని బాబు భావిస్తున్నారు. ఆ మధ్యన అయ్తిఏ తెలంగాణాలో తాను విస్తృతంగా పర్యటిస్తాను అని బాబు చెప్పారు. ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాను అన్నారు. ఇపుడు బాబు జోరు చూస్తూంటే ఆయన తెలంగాణా అంతటా రానున్న రోజులలో  పెద్ద ఎత్తున టూర్లు వేయబోతున్నారు అని అంటున్నారు. ఒక విధంగా కేసీయార్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలోనే బాబు ఉన్నారని అంటున్నారు.

కేసీఆర్ పనిగట్టుకుని 2019 ఎన్నికల్లో తనను ఏపీలో ఓడించడానికి జగన్ కి పూర్తి సాయం అందించారు అన్న మంట బాబులో బాగా ఉంది. ఇపుడు కేసీఆర్ బీయారెస్ పెడుతున్నారు కాబట్టి తెలంగాణాలో టీడీపీ విస్తరణను అడ్డుకోలేరు. దాంతో బాబు తనదైన చాణక్య వ్యూహాలను బయటకు తీసి 2023 ఎన్నికల్లో ఓడించడానికి చూస్తారని అంటున్నారు. తెలంగాణాలో టీయారెస్ ఓడితేనే తప్ప  టీడీపీకి పూర్వ వైభోగం రాదు. దాంతో బాబు ఇపుడు అదే పనిలో ఉన్నారని ఆయన వైఖరి తెలియచేస్తోంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • ChandraBabuNaidu 
  • Telangana 
  • Politics 
  • KCR 
  • BRS 
  • NationalParty 
  • TeluguDeshamParty 
  • Munugode 
  • PoliticalNews 
  • TupakiNews 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS