• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆటోమేషన్ ఎఫెక్ట్ .....

ఆటోమేషన్ ఎఫెక్ట్ .. 5మందిలో ఇద్దరి జాబ్ ఫట్ .. సర్వే లో కీలక విషయాలు

By - Tupaki Desk
Update: 2021-03-19 12:30 GMT
సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్ది సంప్రదాయ శ్రామికశక్తికి నష్టం జరుగుతుంది. ఆటోమేషన్ ఆందోళన కలిగించేస్థాయిలో ఉద్యోగాలను నాశనం చేస్తుంది. తాజాగా PwC సర్వేలో కూడా ఇదే తేలింది. కరోనా మహమ్మారి విజృంభణ  నేపథ్యంలో అన్ని రంగాల్లోను ఆటోమేషన్ వేగంగా జరుగుతోందని, వచ్చే అయిదేళ్ల కాలంలో తమ ఉద్యోగాలు పోతాయని దాదాపు నలభై శాతం మంది ఆందోళన చెందుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. భారత్ సహా 19 దేశాల్లో ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరిగిన సర్వేలో 32,500 మంది పాల్గొన్నారు.  

ఈ సర్వే లోని కీలక విషయాల గురించి చూస్తే...ఆటోమేషన్ కారణంగా తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని 60 శాతం మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 48 శాతం మంది భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాలు ఉండవని అభిప్రాయపడ్డారు. 39 శాతం మంది తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రతి ఐదుగురిలో ఇద్దరు వచ్చే అయిదేళ్ల కాలంలో తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళనగా ఉన్నారు. లాక్ డౌన్ ‌తో తమ డిజిటల్ నైపుణ్యాలు మెరుగయ్యాయని 40 శాతం మంది తెలిపారు. కొత్త నైపుణ్యాలపై దృష్టి సారించినట్లు ఎక్కువమంది తెలిపారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు 77 శాతం మంది, పని ప్రదేశాల్లో కొత్త టెక్నాలజీని స్వీకరించేందుకు 80 శాతం మంది సిద్ధంగా ఉన్నారు

 కరోనా తర్వాత సొంత వ్యాపారంపై ఎక్కువ మంది దృష్టి పెట్టారు. పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న వివక్ష వలన కెరీర్ పురోగతి, శిక్షణ కోల్పోతున్నట్లు 50 శాతం మంది తెలిపారు. సమాజానికి సహకరించే సంస్థలో పని చేయాలని 75 శాతం మంది కోరుకుంటున్నారు. ఇది ముఖ్యంగా చైనా (87 శాతం), భారత్ (90 శాతం)లో ఎక్కువగా ఉంది. సౌతాఫ్రికాలోను 90 శాతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. పిల్లలు, కుటుంబం వంటి వివిధ ఆర్థిక కారణాలతో ఉద్యోగులు ఆర్థికంగా ఉండే సంస్థలకు మొగ్గు చూపుతున్నారు.
Tags:    
  • Automation Effect 
  • jobs 
  • corona effect 
  • corona lockdown 
  • india 

Similar News

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Copyright @2026

Powered by Blink CMS