దారుణం: దళిత యువకుడిపై మూత్ర విసర్జన

Update: 2021-01-30 10:30 GMT
తమిళనాడులో దారుణం జరిగింది.  ఒక దళిత యువకుడి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. స్థానిక దళితులంతా ఆందోళనకు దిగారు. ఇప్పుడక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తమిళనాడులోని పుడుకొట్టాయి జిల్లాలో ఓ దళిత యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతడిపై మూత్ర విసర్జన చేసిన దారుణం వెలుగుచూసింది. దళిత యువకుడు, అతడి స్నేహితులతో కలిసి చెరువులో చేపలు పడుతుండగా తనికొండన్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే యువకుడితో వాగ్వాదం జరిగింది. కులం పేరుతో ప్రదీప్ దళిత యువకులపై దూషణలకు దిగాడు.

అంతేకాకుండా ప్రదీప్ తన ముగ్గురు స్నేహితులతో కలిసివచ్చి దళిత యువకుడిని కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తనపై భౌతిక దాడికి పాల్పడడంతోపాటు ఒంటిపై మూత్ర విసర్జన చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టామని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
Tags:    

Similar News