వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ జాతకం ఎలా ఉందో చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు

Update: 2023-05-30 21:00 GMT
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. కొందరు జ్యోతిష్యులు చెప్పే జ్యోతిష్యం అక్షర సత్యమన్నట్లుగా ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ముందే అంచనా కట్టి మరీ చెప్పేసిన ఒక ప్రముఖ జ్యోతిష్యుడు తాజాగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాన్ని తాజాగా చెప్పేసి సంచలనంగా మారారు. తన అంచనాను తాజాగా ట్వీట్ చేసిన ఆయన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటం ఖాయమని రుద్ర ప్రతాప్ కరణ్ అనే వ్యక్తి ముందుగానే జోస్యం చెప్పటం.. అతగాడు చెప్పినట్లే.. ఎన్నికల ఫలితం వెలువడటంతో ఆయన చెప్పే మాటలకు ఆసక్తి వ్యక్తమవుతోంది.

మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు మొత్తం హోరాహోరీగా పోరాటం చేస్తాయని.. అయినప్పటికీ అంతిమ విజయం మాత్రం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీకే విజయం దక్కుతుందని స్పష్టం చేశారు.

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు మీద కచ్ఛితంగా లెక్క చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ ఫ్యూచర్ మీద చెప్పిన అంచనా ఏ మాత్రం తప్పే కాదన్న మాట వినిపిస్తోంది. మరి.. అతగాడు చెప్పిన జోస్యం నిజమా? అబద్ధమా? అన్నది తేలాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయక తప్పదు.

Similar News