మీర్ పేట్ మాధవి హత్య కేసు.. తెరపైకి అసలు కారణం వచ్చింది!
అవును... ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవి (35)కి అదే గ్రామానికి చెందిన గురుమూర్తి (39)తో 13 ఏళ్ల కిందట వివాహామవ్వగా;
మీర్ పేట్ మహిళ వెంకట మాధవి హత్య కేసు ఈ ఏడాది జనవరిలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్యను గురుమూర్తి చంపడం, అనంతరం ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడటం కోసం అంటూ చేసిన ఆటవిక చర్య మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ స్థాయిలో అతడు ప్లాన్ చేయడానికి గల అసలు కారణం వెలుగులోకి వచ్చింది! దీంతో ఈ హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది.
అవును... ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవి (35)కి అదే గ్రామానికి చెందిన గురుమూర్తి (39)తో 13 ఏళ్ల కిందట వివాహామవ్వగా.. వీరికి కుమారుడు (9), కుమార్తె (4) ఉన్నారు. ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న గురుమూర్తి... అనంతరం డీఆర్డీవో లో కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేసేవాడు.
ఆ కుటుంబం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వరనగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 16న సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో భార్య భర్తల మధ్య గొడవ మొదలవ్వడం.. ఇది చినికి చినికి గాలివానగా మారడం.. దీంతో, గురుమూర్తి తన భార్య తలపై రెండుసార్లు గట్టిగా కొట్టడం తెలిసిందే!
దీంతో... మాధవి వెంటనే సృహతప్పి పడిపోగా.. ఆమె మరణించినట్లూ భావించిన గురుమూర్తి.. మృతదేహాన్ని మాయం చేయాలని భావించి.. ఆ మృతదేహాన్ని కత్తితో ముక్కలుముక్కలుగా నరికి, ముక్కలను కుక్కర్ లో వేసి ఉడికించి.. ఎముకలను బాయిల్ చేసి, ఎండబెట్టి, అనంతరం రోట్లో వేసి పోడిగా మార్చాడు.
అనంతరం ఉడికిన శరీర అవశేషాలను, ఎముకల పొడిని తీసుకుని సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి అందులో పాడేశాడు! ఈ విషయాన్ని నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ క్రమంలో ఇంట్లోని మాధవికి సంబంధించిన శాంపిల్స్ కు పిల్లల డీ.ఎన్.ఏ మ్యాచ్ అవ్వడంతో ఈ కేసుపై ఒక క్లారిటీకి వచ్చారు పోలీసులు! ఈ క్రమంలో.. ఈ హత్యకు గల అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది!
ఇందులో భాగంగా... తన మరదలితో ఉన్న అక్రమ సంబంధం కారణంగా గుర్తుమూర్తి, తన భార్య మాధవితో నిత్యం గొడవ పడేవాడంట. ఈ క్రమంలో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించాడంట. ఈ నేపథ్యంలోనే ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని చెబుతున్నారు. అంటే.. ఈ హత్యకు కూడా వివాహేతర సంబంధమే కారణం అయ్యిందన్నమాట!