మస్క్ సంచలనం... కోర్టు తీర్పుతో $700 బిలియన్స్ సంపద!
వాస్తవానికి 2018 పే ప్యాకేజీ నుంచి ఎలాన్ మస్క్ స్టాక్ ఆప్షన్స్ పునరుద్ధరణకు సంబంధించిన కేసును దిగువ కోర్టు రద్దు చేయగా.. గత వారం డెలావర్ సుప్రీంకోర్టు ఆ స్టాక్ ఆప్షన్లను పునరుద్ధరించింది.;
ఈ భూగ్రహంపై అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ వారం ప్రారంభంలో 600 బిలియన్ డాలర్ల నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. అతని ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ పబ్లిక్ గా విడుదల కావచ్చనే ఊహాగానాలు దీనికి కొంతమేర దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా మస్క్ సంపద 700 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
అవును... ఎలాన్ మస్క్ సంపద ఆకాశమే హద్దుగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. కేవలం ఐదేళ్లలోనే $600 బిలియన్లు సాధించడం అందుకు ఓ ఉదాహరణ. ఈ క్రమమో.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో తన పాత్రకు సంబంధించిన భారీ పరిహార ప్యాకేజీని పునరుద్ధరించిన కోర్టు తీర్పు తర్వాత మస్క్ చరిత్రలో 700 బిలియన్ డాలర్లకు పైగా నికర విలువను చేరుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు.
వాస్తవానికి 2018 పే ప్యాకేజీ నుంచి ఎలాన్ మస్క్ స్టాక్ ఆప్షన్స్ పునరుద్ధరణకు సంబంధించిన కేసును దిగువ కోర్టు రద్దు చేయగా.. గత వారం డెలావర్ సుప్రీంకోర్టు ఆ స్టాక్ ఆప్షన్లను పునరుద్ధరించింది. దీని ఫలితంగా అతని అంచనా సంపద సుమారు 749 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎందుకంటే.. ఈ ఆప్షన్ల విలువ ఇప్పుడు సుమారు 139 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒప్పంద సమయంలోని $56 కంటే ఇది చాలా ఎక్కువ!
అసలేం జరిగిందంటే... 2018లో టెస్లాను వృద్ధి పథంలో నడిపించినందుకు గానూ ప్రోత్సాహకం కింద టెస్లా ఎలాన్ మస్క్ కు 56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ ఇవ్వాలనుకుంది. అయితే మస్క్ కు ఇంత భారీ మొత్తంలో వేతన చెల్లింపుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కంపెనీకి చెందిన ఓ వాటాదారు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ వేతన ప్యాకేజీని రద్దు చేస్తూ 2024లో దిగువ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీనికి కారణం ఆ ఫిర్యాదుదారుడు... మస్క్ కు అనుకూలంగా ఉన్న బోర్డే ఈ వేతన ప్యాకేజీని రూపొందించిందని.. అనుమతుల ప్రక్రియలో నిబంధనలనూ పాటించలేదని పేర్కొన్నారు. ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో డెల్వార్ సుప్రీంకోర్టు నుంచి మాత్రం మస్క్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇది మస్క్ కు కోర్టులో భారీ విజయంగా నిలిచింది. దీంతో.. 2018 నాటి వేతన ప్యాకేజీని పునరుద్ధరించాలని కోర్టు తీర్పు చెప్పింది.
కాగా... మస్క్ కు టెస్లాకు మించి ఖరీదైన వ్యాపారాలు విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు టెస్లాలో 12% వాటా మాత్రమే ఉండగా... రాకెట్ తయారీ స్సంస్థ స్పేస్ ఎక్స్ లో ఆయనకు 42 శాతం వాటాలు ఉండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ ఏఐ హోల్డింగ్స్ లో 53% వాటా ఉంది.