పవన్ ను పొగిడేసి.. చిరును అంత మాట అనేశాడే..!

Update: 2020-01-12 03:52 GMT
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మూడు రాజధానులపై మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యన స్పందించి.. మంచి నిర్ణయమని పేర్కొనటం తెలిసిందే. దీనిపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తాజాగా రియాక్ట్ అయ్యారు. చిరు వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

చిరంజీవి వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించిన ఆయన.. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటాయని చెప్పారని మండిపడ్డారు. ప్రపంచంలో బహుళ రాజధానుల వ్యవస్థ ఫెయిల్ అయ్యిందన్న విషయం ఆయనకు తెలీదా? అని ప్రశ్నిస్తూ.. చిరు సోదరుడు పవన్ ను పొడిగేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

పవన్ కల్యాణ్ కు సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదించే వీలుంది. కానీ.. ఆయన అది వదిలేసి.. రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నారు? ఈ విషయం చిరంజీవికి తెలీదా? రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న సినీ నటుడు పృథ్వీరాజ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అసలు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అని ప్రశ్నించారు.

అంతేకాదు.. ఇలాంటి వాళ్లను పక్కన పెట్టుకోవడం జగన్‌ దురదృష్టమని పేర్కొన్నారు. ఉద్యమానికి మద్దతు కోసం సినీహీరోలను రైతులు అడ్డుకోవాల్సిన అవసరం లేదని.. వాళ్ల సినిమాలు చూడటం మానేస్తే.. వాళ్లే దిగివస్తారంటూ వ్యాఖ్యానించటం గమనార్హం.


Tags:    

Similar News