అక్రమసంబందాల జాబితాలో మనవారి నెంబర్!

Update: 2015-08-27 15:48 GMT
ప్రపంచంలోని సుమారు 3 కోట్ల అక్రమసంబందాలను ఒకేసారి వెలుగులోకి తీసుకొచ్చి కోట్ల కుటుంబాలను అల్లకల్లోలం చేసిన వెబ్ సైట్ ఆష్లే మాడిసన్! భార్యకు తెలియకుండా భర్త... భర్తకు తెలియకుండా భార్య, ప్రియుడికి తెలియకుండా ప్రేయసి, ప్రియురాలి కల్లుగప్పి ప్రియుడు... ఇలా మోసం చేసే అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ తమ భాగస్వామి కల్లుగప్పి సాగించిన అక్రమ సంబందాల వేదిక ఆష్లే మాడిసన్ వెబ్ సైట్! ఈ సైట్ అంతా అనుమానాల పునాదులపైన, అత్యాశల ఆలోచనలపైనా బ్రతుకుతున్న మనుషుల అక్రమ సంబందాల పుట్ట!

ఈ వెబ్ సైట్ లో కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు... సునాయాసంగా అక్రమసంబందాలు పెట్టుకున్నారు! అయితే ఈ వెబ్ సైట్ లో నమొదైన వారంతా విదేశీయులే అని ఇప్పటివరకూ భ్రమపడుతున్న వారికి ఇదొక షాకింగ్ న్యూస్! ఇప్పటివరకూ ఈ సైట్ లో రిజిస్టర్ అయిన వారిలో భారతీయులు కూడా బాగానే ఉన్నారు. టెక్నలాజికా అనే సంస్థ లీక్ చేసిన డేటా ప్రకారం... ఈ అక్రమసంబందాలు నడుపుతున్న లేక వాటికోసం పరితపించి నమోదుచేసుకున్న వారిలో భారతదేశ రాజధాని ఢిల్లీ వాసులు అధికసంఖ్యలో ఉన్నారు.

రాష్ట్రాలు లేక పట్టణాల వారీగా ఈ డేటాని పరిశీలిస్తే... ఢిల్లీకి చెందినవారు 38,620.. ముంబయికి చెందినవారు 32,888.. చెన్నై - 16,355.. బెంగళూరు - 16,267.. హైదరాబాద్ - 12,548.. కోల్ కతా - 11,751.. పూణె - 9,738 మంది ఆష్లే వెబ్ సైట్ లో సభ్యులుగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధం అవుతుంది!
Tags:    

Similar News