అసలు విషయం చెప్పి షాకిచ్చిన టిక్ టాక్ బ్యూటీ
నిజం చెప్పాలంటే టిక్ టాక్ ఎంట్రీ తర్వాత సోషల్ మీడియా రూపురేఖలు మారిపోయాయి. అప్పటివరకు మెసేజ్ లు.. ఫోటోలతో ఉన్న గ్లామర్ ప్రపంచం ఒక్కసారిగా వీడియోల వైపు మళ్లింది. క్రియేటివిటీతో పాటు.. తమను తాము ప్రజెంట్ చేసుకోవటానికి.. పాపులార్టీ పెంచుకోవటానికి టిక్ టాక్ చేసిన సాయం అంతా ఇంతా కాదు.
టిక్ టాక్ ముందు వరకు ప్రపంచం ఒక కుగ్రామంగా ఉంటే.. ఈ టిక్ టాక్ తర్వాత.. ఒక వీధిగా మారిపోయింది. ఎక్కడెక్కడో వేలాది కిలోమీటర్ల దూరంతో ఉన్న వారు.. సెలబ్రిటీ స్టేటస్ లేనోళ్లు ఎంతోమంది.. టిక్ టాక్ పుణ్యమా అని సరికొత్త క్రేజ్ తెచ్చుకోవటమే కాదు.. ఎన్నో ఆసక్తికర విషయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంకోలా చెప్పాలంటే.. టిక్ టాక్ పుణ్యమా అని.. మీడియా సంస్థలు సైతం తీవ్ర ప్రభావానికి గురై.. ఈ సోషల్ మీడియాకు సంబంధించిన అంశాల్ని తప్పనిసరిగా వార్తాంశాలుగా తీసుకోక తప్పని పరిస్థితికి తీసుకెళ్లాయి. ఇండియాల్ బ్యాన్ అయిన టిక్ టాక్.. ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము దులుపుతోంది.
టిక్ టాక్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి.. దానితో దీర్ఘకాలంగా అసోసియేట్ అయినోళ్లకు అష్లీ డిస్టెఫానో సుపరిచితురాలు. తన అందం.. ఆకర్షణతో పాటు.. పిచ్చెక్కించే ఫోటోలు.. వీడియోలతో ఫిదా అయ్యేలా చేయటం తెలిసిందే. ఇప్పటివరకు ఆమె వయసు ఎంతన్నది ఒక పెద్ద సీక్రెట్ గా ఉండేది.
అలాంటిది తాజాగా ఆమె తన వయసును రివీల్ చేసి.. అందరి నోట మాట రాకుండా చేశారు. జస్ట్ 22.. 22 మధ్యలోనే ఆమె ఏజ్ ఉంటుందని భావించేటోళ్లకు అదేమీ కాదు.. నా వయసు 38 అంటూ అసలు సీక్రెట్ చెప్పేసి.. ఆశ్చర్యానికి గురి చేసింది.
ఫార్టీస్ కు దగ్గరగా వచ్చేసి కూడా ట్వంటీస్ లా కనిపించటం ఎలా? అంటే.. అదే అస్లీ స్పెషాలిటీగా చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. తన గురించి చెబుతూ.. తాను 20 ఏళ్ల కుర్రాళ్లతోనే డేటింగ్ కు వెళతానని చెప్పింది. ఎందుకంటే.. ఆ వయసు వారితో వెళ్లినప్పుడే.. తన ఏజ్ కు తగ్గట్లుగా ఉంటారని పేర్కొంది.
ఇప్పుడామెకు 38 అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత కొందరు పెద్ద వయస్కులు డేటింగ్ కోసం ఆమెను ట్రై చేస్తే.. అందుకు నో అంటే నోచెప్పేసింది. తాను వారితో వెళితే..తన వయసుకు.. వారివయసుకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్న విషయం ఇట్టే తెలుస్తుందని.. అందుకే తాను వెళ్లనని స్పష్టం చేసింది. అష్లీకి టిక్ టాక్‌లో @ashleydistefano727 అకౌంట్ ఉంది. ఇన్ స్టాలోనూ ఆమె ఫేమస్సే.
ఫార్టీస్ లో ఉండి కూడా ట్వంటీస్ లో ఉన్నట్లుగా ఎలా సాధ్యం? మీ బ్యూటీ సీక్రెట్ ఏమిటన్న ప్రశ్నను వేలాది మందిని ఆమెను అడుగుతుంటారు. ఇందుకు ఆమె తనదైన శైలిలో సమాధానం ఇస్తూ.. తాను ఓల్డ్ వైన్ లా వయసు పెరిగే కొద్దీ అందంగా ఉంటానని చెప్పింది.
ఇంతకీ మీ బ్యూటీ సీక్రెట్ ఏమిటన్న ప్రశ్నకు మన బాలీవుడ్.. టాలీవుడ్ నటీమణుల మాదిరి.. ‘మా అమ్మ’ లాంటి మాటలు చెప్పకుండా తన అందం వెనుకున్న రహస్యాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అందంగా కనిపించాలంటే ఏమేం చేయాలో చెప్పేసింది.
విటమిన్ సీ.. ట్రిటినోయిన్.. గ్లైకోలిక్.. హ్యాలురోనిక్ యాసిడ్.. హైడ్రోక్వినోన్.. సన్ స్క్రీన్ వంటివి వాడుతానని ఆమె పేర్కొంది. తరచూ ఫేషియల్స్ చేయించుకుంటాననీ, కెమికల్ పీల్స్, ఇంటెన్స్ పల్స్డ్ లైట్, హైపర్ పిగ్మెంటేషన్ వంటి ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటానని తెలిపింది.
తాను స్మోక్ చేయనని.. మితంగా వర్కవుట్లు చేస్తానని.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటానని.. మొక్కలతో కూడి ఫుడ్ తన మెనూలో ఉంటుందని చెబుతోంది. ఏమైనా.. అష్లీకి 38 ఏళ్లు అంటే మాత్రం నమ్మటం కాస్త కష్టమే బాస్.