ఏపీ కోసం క‌దిలిన ఆశాజ్యోతి సైన్యం

Update: 2016-09-27 03:58 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని అట్ట‌డుగు వ‌ర్గాలకు మెరుగైన విద్య‌ - వైద్య అందించ‌డం ద్వారా వారి జీవితాల్లో స్ప‌ష్ట‌మైన మార్పు తెచ్చేందుకు కృషిచేస్తున్న ఆశాజ్యోతి నిర్వ‌హించిన ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయింది. ఆశాజ్యోతి 100 శాతం లాభాపేక్ష లేని స్వ‌చ్ఛంద సంస్థ‌. ఈ కార్య‌క్ర‌మం ద్వారా సేక‌రించిన‌ ప్ర‌తి ఒక్క డాల‌ర్ విద్య‌ - వైద్య‌ రంగాల్లో భార‌త‌దేశంలోని పేద‌ల పురోగ‌తి కోసం ఖ‌ర్చు చేయ‌బ‌డ‌తాయి. గ‌త ఏడాది ఆశాజ్యోతి ద్వారా 50కి పైగా ప్లస్ పాఠ‌శాల్లో 3250 మంది విద్యార్థుల‌కు విద్యాభ్యాసానికి అవ‌స‌ర‌మైన వాటిని అంద‌జేశాం. దీంతో పాటు అనేక వైద్య శిభిరాల‌తో పాటు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ఆప‌న్నులను ఆదుకునేందుకు ఎన్నారైలు క‌దిలివ‌చ్చి త‌మ వంతు స‌హాయం అంద‌జేశారు.

తాజాగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం సుమారు 800 మందికి పైగా అతిథుల‌తో విజ‌య‌వంతం అయింది. మా ప్ర‌ముఖ స్పాన్స‌ర్స్‌ లు అయిన సాన్ డిస్క్‌ - బావార్చీ (శ్రీ‌కాంత్ దొడ్డ‌ప‌నేని) - జీఎస్‌ పాన్‌ - స్కౌర్జ్‌ - కోవెట్ ఐటీ - ఎస్ ఆర్ ఎస్ క‌న్స‌ల్టెంగ్‌ - ఎడ్వెన్సా - శ్రీ‌నివాస్ మైనేని రియాల్ట‌ర్‌ - స్వీట్ పాన్ హౌస్‌ - సిస్కో - వ‌ర‌ల్డ్ ఐపీ - స్పార్ట‌న్ సొల్యూష‌న్స్‌ - నింబిల్ అకౌంటింగ్‌ - రిస్టోర్ స్మైల్ డెంట‌ల్‌ - మున్షిజీ247 - ఎగిల్ టాక్స్ స‌ర్వీస్‌ - డ్రీమ్ స్కేప్ క‌స్ట‌మ్ హోమ్స్‌ - మ‌రియు బాటా  ఇలాంటి ఉదాత్త కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించినందుకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.

ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయ్యేందుకు పూర్తి స్థాయిలో శ్ర‌మించిన మా వాలంటీర్ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం. మా ప్ర‌ధాన వాలంటీర్ల‌తో క‌లిసి మొత్తం 60 మంది ఈ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించారు. భార్గ‌వి క‌న్నిగంటి - శ్రీ‌నివాస్ మాడినేని - సాయి న‌వీన్ దండ‌ - విజేత పోపూరి - వంశీధ‌ర్ బొప్పుడి - శ్రీ‌ధ‌ర్ గంగినేని - వినూత కొల్లి - సుబ్ర‌హ్మ‌ణ్యం రావిపాట‌ - వేణు క‌ర‌ణం - హ‌జార‌త్ దార‌ప‌నేని - ప‌ద్మిని పాల‌డుగు - వంశీ అబ్బూరి - శ్రీ‌నివాస్ మైనేని - చైత‌న్య దేవ‌ర‌ప‌ల్లి - శ్వేత బూరుగుప‌ల్లి - ఆనంద్ సిర‌సాలా - వెంక‌ట్ గుండ్ల‌ప‌ల్లి త‌దిత‌రులు ఉన్నారు.
Tags:    

Similar News