ఆ సీఎం.. బాహుబలి-2 ఫస్ట్ డే షో

Update: 2017-04-29 09:08 GMT
నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండే వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఐతే ఈసారి ఆయన రాజకీయ కారణాలతో కాకుండా ఓ సినిమా సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చారు. ఇండియాను రెండు రోజులుగా ఊపేస్తున్న ‘బాహుబలి’ ఫీవర్ కేజ్రేవాల్ కు కూడా సోకడం విశేషం. ఆయన కూడా ‘బాహుబలి’ విషయంలో సగటు ప్రేక్షకుడిలాగే స్పందించారు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్స్‌కు కుటుంబ సమేతంగా వెళ్లి సినిమా చూశారు కేజ్రీవాల్. ఆయన వెంట మంత్రి సోమనాథ్ భారతి.. మరి కొందరు నేతలు కూడా ఉన్నారు.

కేజ్రీవాల్ నేపథ్యం.. ఆయన రాజకీయాల్లో వ్యవహరించే తీరు చూస్తే.. ఇలా తొలి రోజే ‘బాహుబలి-2’ సినిమా చూస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. కొందరు వ్యక్తులు బయటికెలా కనిపించినా లోలోన మరోలా ఉంటారనడానికి ఇది రుజువు. కేజ్రీవాల్ అనే కాదు.. దేశవ్యాప్తంగా ఎందరో పెద్ద రాజకీయ నాయకుల్ని.. వ్యాపార దిగ్గజాల్ని కదిలించిన సినిమా ‘బాహుబలి’. మహీంద్రా మోటార్స్ అధినేత ఆనంద్ మహీంద్రా సైతం బాహుబలి అభిమానుల్లో ఒకరు. ఆయన కూడా తొలి రోజే సినిమా చూశారు. ఇంకా వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ‘ది కంక్లూజన్’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News