ఫిబ్రవరి-14...క్రేజీవాల్ కి స్పెషల్ ఎందుకంటే!

Update: 2020-02-11 10:15 GMT
అరవింద్ క్రేజీవాల్ ...ఇప్పుడు ఈ పేరు మరోసారి మారుమోగిపోతోంది. వరుసగా మూడు సార్లు ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోబోతుండటం తో దేశం మొత్తం ఆయనకి జేజేలు కొడుతున్నారు. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో క్రేజీవాల్ సారథ్యంలోని  ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ని అంచనాలను నిజం చేస్తూ భారీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. దీనితో దాదాపుగా  అరవింద్ కేజ్రీవాల్  మూడోసారి సీఎం కావడం ఖరారైంది. ఎన్నికల పోలింగ్ తరువాత బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు గాలి మాటలే అని ఓట్ల లెక్కింపు మొదలుపెట్టిన కొద్దిసేపటికే తెలిసిపోయింది.

ఇకపోతే , అతి త్వరలో లవర్స్ డే రాబోతోంది. ఆ రోజు లవర్స్ కి చాలా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. కానీ , ఈ లవర్స్ డే ఒక్క ప్రేమికులకే కాదు అరవింద్ క్రేజీవాల్ కి కూడా ప్రత్యేకమైన రోజే. 2013లో కాంగ్రెస్‌ తో విభేదాల వల్ల 14 ఫిబ్రవరి 2014న సీఎం పదవికి రాజీనామా చేశారు. 2015లో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14నే మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మళ్లీ ఆప్ అధికారంలోకి రానుండటంతో ఫిబ్రవరి 14నే కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా లవర్స్ డే క్రేజీ.. కేజ్రీవాల్‌ కు కూడా బాగానే వర్కౌట్ అవుతుందంటున్నారు.
Read more!

 కాగా..ఢిల్లీ లో అప్ విజయం దాదాపుగా ఖాయం కావడంతో ..అప్ పార్టీ నేతలు  - కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అయితే , ఈ సందర్భంలో కేజ్రీవాల్‌ తమ పార్టీ క్యాడర్‌ కు ఓ ముఖ్య సూచన చేశారు. విజయోత్సవాలు జరుపుకోండి కానీ.. బాణాసంచా మాత్రం కాల్చకండని ఆదేశించారు. ఎందుకు అంటే ..ఢిల్లీ కాలుష్యం గురించి అందరికి తెలిసిందే ..మొన్న ఆ మధ్య దీపావళి పండుగ తరువాత ఢిల్లీ వాసులు నగరాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Tags:    

Similar News