ఏపీ హైకోర్టు సీజేగా గోస్వామి ?

Update: 2020-12-16 02:30 GMT
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ కుమార్ గోస్వామి నియమితులైనట్లు సమాచారం. గోస్వామి ప్రస్తుతం సిఖ్ఖిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. ఇదే సమయంలో ప్రస్తుత చీఫ్ జస్టిస్ గా ఉన్న జేకే మహేశ్వరిని సిఖ్ఖిం సీజేగా బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాగే తెలంగాణాలో హైకోర్టు సీజేగా ఆర్ఎస్ చౌహాన్ కూడా బదిలీ చేసిందట కొలీజియం.

దేశవ్యాప్తంగా ఆరుమంది హైకోర్టు చీఫ్ జస్టిస్సులతో పాటు కొలీజియం మరికొందరు జడ్జీలను కూడా బదిలీ చేసినట్లు సమాచారం. అస్సాంకు చెందిన గోస్వామి 1961లో జన్మించారు. 1981లో గువహటి యూనివర్సిటి నుండి ఎకనామిక్స్ డిగ్రీ తీసుకున్నారు. అలాగే 1985లో ఇదే యూనివర్సిటి నుండి లా చేశారు.

జేకే మహేశ్వరి పోయిన ఏడాది అక్బోబర్ 7వ తేదీన ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు తీసుకున్నారు. ఏపికి బదిలీ అయ్యేముందు మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. విద్యుత్ ఒప్పందాలు మొదలుకుని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ వివాదాలన్నింటినీ మహేశ్వరే వ్యక్తిగతంగా విచారించారు. ఈ సందర్భంగా మహేశ్వరి చేసిన అనేక వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి మనస్తాపంతో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి లేఖ రూపంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News