నిర్మలమ్మ బడ్జెట్ ఏపీకి ఏమిచ్చింది ?

ఏపీ విభజన తరువాత కొత్త రాష్ట్రం అయింది. అన్ని విధాలుగా మొదటి నుంచి అంతా చక్కబెట్టుకోవాల్సి ఉంది.;

Update: 2026-02-02 03:15 GMT

ఏపీ విభజన తరువాత కొత్త రాష్ట్రం అయింది. అన్ని విధాలుగా మొదటి నుంచి అంతా చక్కబెట్టుకోవాల్సి ఉంది. రాజధాని కూడా ఇంకా నిర్మాణం కాని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో ఏపీకి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లో ఏ మేరకు ప్రయోజనం సంకూరుతోందన్నది ఒక చర్చగా ముందుకు వస్తోంది. ఈసారైనా ఏపీకి తగిన ప్రాధాన్యత దక్కిందా అన్నది అందరిలోనూ ఆసక్తితో పాటు ఉత్కంఠ కూడా ఉంది.

రాజధాని అభివృద్ధి :

అయితే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లుగా 2026 -2027 బడ్జెట్‌లో స్పష్టం అయింది. అందుకే సుమారుగా 1,128.91 కోట్ల రూపాయలను ప్రాథమికంగా కేటాయించింది అని చెప్పాలి. అంతే కాకుండా అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ కోసం ఐబీఆర్‌డీ నిధుల ద్వారా 432.9 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నారు.

గ్రామీణ పట్టణాభివృద్ధి కోసం :

ఇక ఏపీలోని పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదలకు సమబంధించి కూడా కేంద్రం శ్రద్ధ పెట్టినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఏపీలోని పట్టణ ప్రాంతాల కోసం 800 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే గ్రామీణ రహదారులు విషయానికి వస్తే ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు 500.99 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక రహదారులు, వంతెనలు గురించి కూడా కేంద్ర బడ్జెట్ ఫోకస్ పెట్టింది. అలా వీటిపునర్నిర్మాణ పనుల నిమిత్తం 350 కోట్ల రూపాయలు కేటాయించింది.

విద్యాసంస్థలకు కేంద్ర గ్రాంట్లు:

అదే విధంగా చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం పలు విభాగాల ద్వారా ఏపీలోని ప్రముఖ ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలకు పరిశోధనా గ్రాంట్లను ప్రకటించింది. ఇది నిజంగా మేలు అయిన నిర్ణయంగా చెబుతున్నారు. అణుశక్తి విభాగం నుంచి అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎంలో పరిశోధనల కోసం నిధుల కేటాయింపు జరిగింది. అలాగే విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం కి కూడా గ్రాంట్స్ ఈ పరిశోధనలకు కేటాయించారు. ఇక అంతరిక్ష విభాగం నుంచి విడుదల అయ్యే గ్రాంట్స్ ని ఏపీలోని కొన్ని విద్యా సంస్థలకు కేటాయిస్తున్నారు. వీటితో అంతరిక్ష పరిశోధనలు సాంకేతికత అభివృద్ధి కోసం వెచ్చించాల్సి ఉంటుంది.అలా చూస్తే కనుక విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్, శ్రీసిటీలోని త్రిపుల్ ఐటీ, బెంగళూరులోని గీతం వర్శిటీకి ఈ గ్రాంట్లు లభించనున్నాయి. ఈ మేరకు కేంద్రం వీటిని ఎంపిక చేసింది.

Tags:    

Similar News