కింగ్ మేకర్ ని కాను కింగ్ నే - తమిళ దళపతి

రాజకీయాల్లో ఎవరైనా కింగ్ కావాలనే కోరుకుంటారు. అది సహజం. వేరే పార్టీలలో పనిచేసే వారు సైతం ఉన్నత స్థానం కోసమే లక్ష్యంగా చేసుకుని జీవిత కాలం పనిచేస్తారు.;

Update: 2026-02-02 03:55 GMT

రాజకీయాల్లో ఎవరైనా కింగ్ కావాలనే కోరుకుంటారు. అది సహజం. వేరే పార్టీలలో పనిచేసే వారు సైతం ఉన్నత స్థానం కోసమే లక్ష్యంగా చేసుకుని జీవిత కాలం పనిచేస్తారు. అలాంటిది అపరిమితమైన పాపులారిటీ ఉండి, మాస్ అప్పీల్ తో జనంలోకి దూసుకెళ్ళే సత్తా కలిగిన సూపర్ స్టార్ పార్టీ పెడితే కచ్చితంగా కింగ్ కావాలనే అనుకుంటారు. ఆయన అభిమానులు కూడా అదే కోరుకుంటారు. తమిళ దళపతిగా పేరు గడించిన తమిళగ వెట్రీ కజగం టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా అదే అంటున్నారు.

కింగ్ మేకర్ ని కాను :

తన గురించి కింగ్ మేకర్ అని అంటున్నారు అని ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే తాను కింగ్ మేకర్ ని కాను కింగ్ నే అని ఆయన గట్టిగా చెప్పారు. తన పట్ల జనాలు చూపిస్తున్న అభిమానం ఎంతో ఉందని అందుకే తాను వారి కోసమే పార్టీ పెట్టాను అని ఆయన చెప్పారు. తన తొలి మీడియా సమావేశంలో విజయ్ స్పష్టంగా తన ఆలోచనలు పంచుకున్నారు. అంతే కాదు తన రాజకీయ వైఖరిని చాటి చెప్పారు. తాను ఓట్లను చీల్చేవాడిని కానని, అలాగే కింగ్ మేకర్‌ని అంతకంటే కానని ఫుల్ క్లారిటీ ఇచారు. తాను రాజకీయ క్షేత్రంలో నిలబడి పోరాడి గెలవడానికే ఇక్కడ ఉన్నాను అని బిగ్ సౌండ్ చేశారు.

ఓటు షేర్ అలా :

ఇదిలా ఉంటే తాజాగా ఇండియా టూడే సీ ఓటర్ చేసిన సర్వేలో తమిళనాడులో విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగంకి 15 శాతం ఓటు షేర్ ఉందని పేర్కొంది. ఇక తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే కూటమికి 45 శాతం ఓటర్ల మద్దతు ఉందని, బీజేపీ అన్నా డీఎంకే కూటమి ఎన్ డీయేకి 33 శాతం ఓటు షేర్ ఉందని స్పష్టం చేసింది. ఇక ఇతరులు ఏడు పార్టీలకు చెందిన వారికి ఏడు శాతం ఓటు షేర్ ఉందని లెక్క తేల్చింది.

మూడు నెలల సమయం :

ఇక ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం ఇంకా ఫోర్స్ గా జనంలోకి రాలేదు, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ ముఖ చిత్రం తమిళనాడులో మారుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే విజయ్ పార్టీకి వచ్చిన 15 శాతం ఓటు షేర్ ఎన్డీయే నుంచే చీల్చి దక్కినదిగా చెబుతున్నారు. రానున రోజులలో - తమిళగ వెట్రీ కజగం పార్టీ ప్రభావం మరింతగా ఎక్కువగ అయితే ఎన్డీయేకి తీవ్ర నష్టం కలుగ వచ్చు అని అంటున్నారు.

ఇక అధికార డీఎంకే కూటమికి కూడా తమిళగ వెట్రీ కజగంతో ఇబ్బంది ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎపుడైతే విజయ్ పార్టీ అధికార డీఎంకే ఓట్లను చీలుస్తుందో అపుడు అసలైన రాజకీయ పోరు స్టార్ట్ అవుతుందని అంటున్నారు. అలా చూస్తే బలమైన ఫోర్స్ గా విజయ్ పార్టీ ఎమర్జ్ అయితే మాత్రం కచ్చితంగా తమిళనాడులో విజయ్ అతి ముఖ్య భూమిక పోషిస్తారు అని అంటున్నారు. మరి ఆయన పార్టీకి వచ్చే సీట్లే కీలకం అయిన దశలో ఆయన కింగ్ మేకర్ కాదు కింగ్ నే అంటే మాత్రం తమిళ రాజకీయం కొత్త నేతను చూస్తుంది అని కూడా అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News