వైరల్: అపోజిట్ మాట్లాడితే రప్పారప్పా నరికేయమని అక్క చెప్పింది
ఏ ముహుర్తంలో మొదలైందో కానీ పుష్ప2లో రప్పారప్పా డైలాగ్ ను రియల్ లైఫ్ లోకి తీసుకొచ్చి.. అందునా రాజకీయాల్లో వాడుతున్న ఈ మాటకు మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువన్న విషయాన్ని వైసీపీ గుర్తించని పరిస్థితి.;
పార్టీకి నష్టం వాటిల్లే చర్యలకు బ్రేకులు వేయాల్సిన అవసరాన్ని వైసీపీ గుర్తించటం లేదా? ఆవేశంతో.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే మాటలకు పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతున్న విసయాన్ని ఆ పార్టీ కీలక నేతలు గుర్తించకపోవటం.. తన కార్యకర్తల్ని కంట్రోల్ లో పెట్టుకోవటం లాంటివి చేయకుండా తప్పుల మీద తప్పులు జరిగే పరిస్థితి. ఏ ముహుర్తంలో మొదలైందో కానీ పుష్ప2లో రప్పారప్పా డైలాగ్ ను రియల్ లైఫ్ లోకి తీసుకొచ్చి.. అందునా రాజకీయాల్లో వాడుతున్న ఈ మాటకు మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువన్న విషయాన్ని వైసీపీ గుర్తించని పరిస్థితి.
తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త ఒకరు చేసిన వీడియో వైరల్ గా మారటమే కాదు.. ఇలాంటి అతితో ప్రజల అభిమానాన్ని పార్టీ ఎలా సొంతం చేసుకుంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి ఉషశ్రీ తమకు చెప్పిందంటే.. అక్క చెప్పింది.. రప్పారప్పా నరికేయమని అంటూ వైసీపీ కార్యకర్త కర్రతో వార్నింగ్ ఇస్తూ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆదివారం వైసీపీ జల్లా అధ్యక్షురాలు.. మాజీ మంత్రి ఉషశ్రీ కోనాపురంలో కాఫీ విత్ వైసీపీ అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉషశ్రీ ఫ్లెక్సీ వద్ద నిలబడిన వైసీపీ కార్యకర్త సురేశ్.. పెద్ద దుంగను పట్టుకొని.. ‘‘అక్క ఏం చెప్పిందంటే అపోజిట్ ఎవడైనా మాట్లాడితే రప్పారప్పా నరికేయమనింది. ఎందుకంటే అక్కంటే మాకు అంత ధైర్యం. మాకు అంత సాహసం’’ అని వ్యాఖ్యానించాడు అక్కడ ఏం చెప్పిందంటే.. అపోజిట్ ఎవడన్నా మాట్లాడినా రప్పారప్పా నరికేయమని చెప్పినందుకే తాను ఈ రోజు మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.
మనగురించి ఎవడొచ్చినా వానికి రప్పారప్పా నరకడమైతే పక్కా అంటూ చేతిలో కర్ర చూపుతూ హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ కావటం.. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు పోలీసులకు అందటంతో సురేశ్ గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.