జీడీపీ వృద్ధిలో అమెరికాకు ముందు భారత్... మస్క్ సింగిల్ స్టేట్ మెంట్ వైరల్!

తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పంచుకున్నారు.;

Update: 2026-02-02 03:52 GMT

తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ సింగిల్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... 2026లో ప్రపంచ వాస్తవ జీడీపీ వృద్ధికి సంబంధించిన టాప్ 10 దేశాల జాబితాను పోస్ట్ చేస్తూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) జనవరి 2026 అంచనాల ఆధారంగా ఒక చార్ట్ ను ఎలాన్ మస్క్ పంచుకున్నారు. ఇందులో అమెరికా కంటే భారత్ ముందు నిలిచింది. ఇది ఆసక్తిగా మారింది.

అవును.... 2026 నాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధికి అమెరికా కంటే భారతదేశం ముందున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డేటాను ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్త విస్తరణలో భారత్ 17% వాటాను కలిగి ఉండగా.. అమెరికా 9.9% వద్ద ఉంది. మరోవైపు చైనా మాత్రం 26.6%తో ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఏది ఏమైనా... రెండు ఆసియా దేశాలు ఇప్పుడు ప్రపంచ జీడీపీ వృద్ధిలో 43.6%ని నడుపుతున్నాయి. ఈ విషయాన్నే పంచుకున్న ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ఇదే క్రమంలో... ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అమెరికా తర్వాత ఇండోనేషియా, టర్కీ, నైజీరియా, బ్రెజిల్, వియత్నాం, సౌదీ అరేబియా, జర్మనీ ఉన్నాయి. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఒక సమూహంలో 1.8% వృద్ధి చెందుతాయని అంచనా వేయగా.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మాత్రం 4.2% వృద్ధి చెందుతాయని. ఐరోపా జోన్ సమిష్టిగా 2% పెరుగుతుండటం గమనార్హం. ఈ సమయంలోనే స్పందించిన మస్క్... "ది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈజ్ చేంజింగ్" (శక్తి సమతులత్య మారుతోంది) అన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొందని.. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయని అంటున్న సమయంలో మస్క్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఈ సందర్భంగా... భారత్, చైనా వంటి అనేక దేశాలపై ట్రంప్ ప్రకటించిన పదునైన సుంకాల చర్యలు చర్చకు వస్తున్నాయి. ఐఎంఎఫ్ 2026లో ప్రపంచ వృద్ధిని 3.3 శాతంగా అంచనా వేయగా.. 2027లో 3.2 శాతంగా అంచనా వేసింది. ఇది ఆసియావైపు ఆర్థిక వేగంలో నిరంతర మార్పును సూచిస్తున్నాయి.

ఎలాన్ మస్క్ తాజా పరిశీలన సంవత్సరాలుగా ఆర్థికవేత్తలు ట్రాక్ చేస్తున్న దానినే ప్రతిధ్వనిస్తుందని అంటున్నారు. వాల్ స్ట్రీట్, సిలికాన్ వ్యాలీ సాంకేతిక వేగాన్ని నిర్దేశిస్తున్నప్పటికీ.. ప్రపంచ వృద్ధి వేగం వెస్ట్రన్ కంట్రీస్ వెలుపల, ఆసియా వైపు ఎక్కువగా నడపబడుతోంది. ఈ నేపథ్యంలోనే... ఎలాన్ మస్క్ ఈ విషయాలను వెళ్లడిస్తూ ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది!

ప్రపంచ వాస్తవ జీడీపీ వృద్ధికి దోహదపడే టాప్ 10 దేశాలు!:

1. చైనా - 26.6%

2. భారతదేశం - 17.0%

3. యునైటెడ్ స్టేట్స్ - 9.9%

4. ఇండోనేషియా - 3.8%

5. తుర్కియే - 2.2%

6. నైజీరియా - 1.5%

7. బ్రెజిల్ - 1.5%

8. వియత్నాం - 1.6%

9. సౌదీ అరేబియా - 1.7%

10. జర్మనీ - 0.9%

Tags:    

Similar News