బెడ్డు మీద అఫ్రిది బ్యాటింగ్ సూపరట

Update: 2016-03-21 10:50 GMT
అసలే ఇండియాతో మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమి తాలూకు బాధలో ఉన్నాడు పాకిస్థాన్ టీ20 కెప్టెన్ షాహిద్ అఫ్రిది. ఈ సమయంలో అతడి పరువు తీసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తోంది ఇండియన్ మోడల్ ఆర్షి ఖాన్. అఫ్రిదితో తాను శృంగారంలో పాల్గొన్నానని.. తన ద్వారా తల్లి కూడా అయ్యానని ఆర్షి సంచలన వ్యాఖ్యలు చేస్తే జనాలు ముందు పట్టించుకోలేదు కానీ.. అతడితో ఏకాంతంగా గడిపినప్పటి ఫొటోలు - వీడియోలు కూడా రిలీజ్ చేయడంతో ఆమెపైకి అందరి దృష్టి మళ్లింది. తాజాగా ఓ హిందీ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆర్షి.

పడక గదిలో ఆఫ్రిది అంత మంచి ప్రేమికుడు మరొకరు ఉండరని.. అతను మంచి వ్యక్తి, మంచి భర్త అని కితాబిచ్చింది ఆర్షి. ‘‘ఆఫ్రిది వేరీ కేరింగ్ - సెన్సిటివ్ - రొమాంటిక్’’ అంటూ పాక్ కెప్టెన్ ను ఆకాశానికెత్తేసింది ఆర్షి. ప్రేమికుడిగా, స్నేహితుడిగా, వ్యక్తిగా అఫ్రిదికి తాను వందకి వంద మార్కులు వేస్తానని చెప్పింది. తాను ప్రస్తుతం గర్భవతినని.. ఆ గర్భం అఫ్రిది వల్లే వచ్చిందని.. తనకు ఇప్పుడు మూడో నెల అని.. ఆర్షిఖాన్ వెల్లడించింది. తాను భోపాల్ లో కాన్పు చేయించుకోబోతున్నానని.. ఆఫ్రిదిని అల్లుడిగా తన తల్లి అంగీకరించిందని ఆర్షి చెప్పడం విశేషం. ఐతే ఆర్షి స్టేట్ మెంట్ల గురించి ఆఫ్రిది ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు ఆర్షిపై పాకిస్థాన్ లో రెండు ఫత్వాలు జారీ కావడం విశేషం.

Tags:    

Similar News