అమెరికాలో భారతీయుడి అరెస్ట్

Update: 2020-08-22 23:30 GMT
అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీసా మోసానికి పాల్పడిన ఆరోపణలపై ఓ భారతీయుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

మోసపూరితంగా పొందిన హెచ్1బీ వీసాలను ఉపయోగించి విదేశీ పౌరులను అమెరికాకు రప్పించిన ఆరోపణలపై భారతీయ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం తెలిపారు.

ఆశిష్ సాహ్నా (48) అనే భారత సంతతి వ్యక్తి మోసపూరితంగా హెచ్1బీ వీసాల కోసం కుట్ర చేయడంతోపాటు వాటి ద్వారా ఇతర దేశాలకు చెందిన వారిని అమెరికాకు రప్పించాడు.

2011-2016 మధ్య అక్రమమార్గంలో ఏకంగా 21 మిలియన్ డాలర్లు సంపాదించాడని అధికారుల విచారణలో తేలింది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న ఈ కేసులో అశిష్ నేరం రుజువైతే సాహ్నికి పదేళ్ల జైలు శిక్ష పడుతుందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
Tags:    

Similar News