కంగనాతో అర్నాబ్ ఇంటర్వ్యూ.. ఏం మాట్లాడుతారో..?
దేశంలో జరుగుతున్న రైతు ఆందోళనపై పాప్ సింగర్ రిహన్న ట్వీట్ చేసిన తరువాత భారతదేశంలో రైతుల సమస్య ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. ఈ ట్వీట్ పై స్పందించిన బాలీవుడ్ నటి కంగనా రిహన్న ట్వీట్ ను మూర్ఖత్వం అంటూ కొట్టిపారేసింది. ఆ తరువాత సచిన్ టెండూల్కర్, అజయ్ దేవ్‌గన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది దేశానికి సంబంధించిన అంతర్గత విషయమని రాసుకొచ్చారు.
అయితే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ మాత్రం రిహన్న ట్వీట్ ను సమర్థిస్తూ రైతుల పక్షాన మాట్లాడారు. ‘‘ఒక్క ట్వీటు నీ ఐక్యతను భయపెడుతూంటే, ఒక్క జోకు నీ నమ్మకాన్ని భయపెడుతూంటే లేదా ఒక్క ప్రదర్శన నీ మతవిశ్వాసాన్ని భయపెడుతూంటే.. అప్పుడు నీ విలువల వ్యవస్థని బలపరుచుకోవాలేగానీ, ఇతరులపట్ల ప్రచారక్ కార్యకర్త కారాదు.’’ అంటూ ట్వీట్ చేశారు.
తాప్సీ చేసిన ఈ ట్వీట్ ను కంగనా తప్పుబట్టింది. ఆమెతో మాటల యుద్ధాన్ని కొనసాగించడం గమనార్హం. తాప్సీని ‘యాంటీ నేషనల్’ మాట్లాడింది కంగనా. కాగా.. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ అర్నాబ్ గోస్వామితో ఇంటర్వ్యూలో పాల్గొనబోతోంది.
దీంతో.. అందరి దృష్టి ఈ ఇంటర్వ్వూపై పడింది. కంగనాతోపాటు, అర్నాబ్ గోస్వామి కూడా ప్రభుత్వానికి మద్దతుదార్లుగా ముద్ర పడిన విషయం తెలిసిందే. కంగనా ఏకంగా రైతులను ఉగ్రవాదులతో పోల్చడం తెలిసిందే. రైతులకు మద్దతు ఇచ్చే వారిని కూడా ఉగ్రవాదులే అంటూ మాట్లాడింది కంగనా. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఏం మాట్లాడుతారోననే ఆసక్తి నెలకొంది.