ప్రపంచ డెస్టినేషన్‌గా తెలంగాణ: రేవంత్
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.;
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. టెక్స్‌టైల్స్ నుంచి సినీ ఇండస్ట్రీ వరకు.. అన్ని రంగాలను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. తాజాగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఆసియా టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా `తెలంగాణ రైజింగ్` నినాదాన్ని మరోసారి వినిపించారు.
అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో.. అన్ని రంగాలను సమానంగా అభివృధ్ధి చేయనున్నట్టు తెలిపారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల అవకాశాలను మెరుగు పరచనున్నట్టు చెప్పారు. ఈ క్రతువులో పారిశ్రామిక వేత్తలు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అభిలషించారు. తెలంగాణలో వస్త్రాలకు ప్రత్యేకత ఉందన్న ఆయన.. నల్లగొండలో దీనిని పారిశ్రామికంగా మలుచుకుని కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ కీలక లక్ష్యమని రేవంత్ రెడ్డి వివరించారు. దీనికిగాను ఏం చేయాలో అన్నీ చేస్తామన్నారు. అందరి నుంచి అభి ప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. సూచనలు, సలహాలు కూడా పాటిస్తున్నట్టు తెలిపారు. పెట్టుబడి దారులు రాష్ట్రానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
కేవలం టెక్స్‌టైల్స్ కేవలం పరిశ్రమే కాకుండా.. అన్ని రంగాలను ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దక్షిణాసియా టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అదేసమయంలో సినీ రంగానికి కూడా తెలంగాణను గమ్యస్థానంగా మార్చుతామన్నారు. అయితే.. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ.. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.