తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల డ్రీం ప్రాజెక్టులు ఒకే వేళలో మొదలవుతున్నాయే?

Update: 2020-08-07 06:50 GMT
తాము అనుకున్నది అనుకున్నట్లు చేసేందుకు ఎంత కష్టానికి సిద్దమయ్యే అధినేతలు తక్కువగా కనిపిస్తారు. అందుకు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు.. మొండితనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఏదైనా విషయాన్ని లక్ష్యంగా తీసుకుంటే.. దాన్ని పూర్తి చేసే వరకు వదలని తత్త్వం.. అందుకోసం ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోవటానికి సిద్ధమవుతారు.

 తాను అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతున్నా..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలగా చెప్పే కొత్త సచివాలయం పనులు ఇప్పుడిప్పుడే వాస్తవరూపం దాలుస్తున్నాయి. అదే సమయంలో.. ఏపీలో ఒకటి కాదు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను వాస్తవరూపంలోకి తీసుకురావటంలో జగన్ సర్కారు ఊహించనంత వేగాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి.

ఒక విధంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలల ప్రాజెక్టు ఇంచుమించు ఒకే టైంలో తెర మీదకు వచ్చినట్లేనని చెప్పాలి. వచ్చే దసరాకు కొత్త సచివాలయానికి భూమిపూజ చేసేందుకు ముహుర్తం పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అధికారులు ఇందుకు అవసరమైన పనుల్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు.. ఏపీ రాజధానిగా విశాఖకు తరలించే విషయంలోనూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాజధాని తరలింపుతో పాటు.. కొత్త నిర్మాణాల్ని షురూ చేయాలన్న యోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల డ్రీం ప్రాజెక్టులకు సంబంధించిన పోలికలు రానున్న రోజుల్లో మరింత పెరగటం ఖాయమని చెప్పాలి. ఒకే టైంలో ఈ రెండు ప్రాజెక్టులు వాస్తవరూపం దాలుస్తున్న వేళ.. ఎవరు ఎంత సమర్థంగా తమ కలల ప్రాజెక్టుల్ని రియాలిటీలోకి తీసుకొస్తున్నారన్న చర్చ జోరుగా సాగటం ఖాయమని చెప్పాలి. మరీ విషయంలో ఎవరు ముందుంటారు? ఎవరు వెనకబడతారు? అలాంటిదేమీ లేకుండా ఇద్దరు పోటాపోటీగా తమ కలల్ని తీర్చుకుంటారా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.
Tags:    

Similar News