• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాపులకు సీఎం అర్హత లేదా?...

కాపులకు సీఎం అర్హత లేదా? తొక్కేస్తున్నారా? ఏమిటీ దారుణం

By - Tupaki Desk
Update: 2022-12-28 07:30 GMT
దశాబ్దాలుగా కాపులను వాడుకుంటూ సీఎంలు అయిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ అగ్రవర్ణాల చేతిలో ద్వితీయ శ్రేణి నేతలుగానే కాపులు మిగిలిపోతున్నారు. రాజ్యాధికారానికి దూరంగా రెడ్డి, కమ్మ వర్గాల పల్లకీ మోస్తున్నారు... కాపు వర్గానికి చెందిన వారు సీఎం అవ్వడమే లక్ష్యంగా ఈసారి పాటుపడుతున్నారు. ఉద్యమిస్తామని కాపు సంఘం నేతలు ప్రకటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ వేదికగా 'కాపునాడు' రగిలించారు.  ఈ తరుణంలో మాజీమంత్రి, కాపు వర్గానికి చెందిన పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాపుల్లో సీఎం అయ్యే అర్హత ఎవరికీ లేదన్నారు. ముఖ్యమంత్రి కావాల్సిన లక్షణాలు ఇప్పుడున్న కాపు రాజకీయ నేతల్లో లేవని అన్నారు. దీంతో కాపువర్గాల్లో మరోసారి చిచ్చు రగిల్చినట్లయింది. ఇప్పటి వరకు కాపులకు సరైన విధంగా న్యాయం చేస్తామని ఓ వైపు జగన్ ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు పేర్ని నాని లాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మమేంటని చర్చించుకుంటున్నారు.

జగన్ మెప్పు కోసం కొందరు నాయకులు సొంత సామాజికవర్గాన్ని కించపరుస్తున్నారు. సొంత కాపు నేతలపై తీవ్ర విమర్శలు చేయడానికి వెనుకాడరు. ఇటీవల కాపు రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో వైసీపీలోని కాపు నాయకులు జగన్ రంగంలోకి దించారు.

వారితో విమర్శలు చేయిస్తూ కాపులను అయోమయానికి గురి చేస్తున్నారు. గతంలో  అంబటి రాంబాబు కాపులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో జగన్ మెప్పు కోసం అవసరమైతే సొంత కులాన్ని అయినా తిట్టుకుంటామని తాజాగా పేర్ని నాని నిరూపించారు.

తాజాగా పేర్ని నాని మాట్లాడుతూ ఎప్పటికైనా సీఎం జగనే కాపులకు న్యాయం చేస్తారని అన్నారు. ఇప్పుడున్న కాపుల్లో సీఎం లక్షణాలు ఎవరికీ లేవన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసేవారే సీఎం అవుతారని, ఆ లక్షణాలు కేవలం జగన్ లోనే ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా గతంలో పేర్ని నాని జనసేనాని పవన్ ను పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పడు తన వర్గంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలవుతున్నారు.

అయితే మంత్రి పదవి లేనందున మరోసారి జగన్ మెప్పుకోసమే పేర్నినాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. అధికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రస్తుతం జనసేన తీవ్రంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనపై మాటల దాడి చేయడానికి కాపునేతలనే రంగంలోకి దించుతున్నారు జగన్. వీరిలో పేర్ని నాని అందరికంటే ముంద వరుసలో సొంత కులాన్ని నిందించుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల జగన్ ఏదో ఒక పదవిని పేర్ని నానికి ఇస్తారని అనుకుంటున్నారు. కానీ సొంత కులాన్ని తిట్టి నాని ఈ సామాజికవర్గంలో విలన్ అవుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • APPolitics 
  • KapuCommunity 
  • PeriniNani 
  • YSRCPGovernment 
  • YSJaganMohanReddy 
  • PeriniNaniAboutNani 
  • APAssemblyElections 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS