• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ: అవినీతిలో అగ్రస్థానం...

ఏపీ: అవినీతిలో అగ్రస్థానం ఆ జిల్లాకే ..14400 కి భారీ స్పందన !

By - Tupaki Desk
Update: 2019-12-02 07:10 GMT
అవినీతి ..లంచగుండి తనం ..ప్రస్తుత రోజుల్లో భారీగా పెరిగిపోయింది. ఇక్కడ, అక్కడ అని లేకుండా ప్రతి చోట అవినీతిమయమే. ఏ ప్రభుత్వ ఆఫీస్ కి వెళ్లి పలానా పని చేయండి అని అడగ్గానే ఆ అధికారుల నోటి నుండి వచ్చే మొదటి మాట ..నీ పని చేసి పెడితే నాకేంటి లాభం ..నాకు ఎంత ఇస్తావ్ . ఇలా తమ అవసరాలకోసం వెళ్లిన వారు కొంతమంది వారు అడిగిన లంచాన్ని ఇచ్చి పని చేపించుకుంటుంటే ..మరికొంతమంది మాత్రం లంచం ఇవ్వలేక ..ప్రాణాలని తీసుకుంటున్నారు. లంచం ఇవ్వలేక ప్రాణాలని తీసుకున్నవారిని మనం ఏంటో మందిని చూసాం.

దీనిపై తాజాగా జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీ అభివృద్దే ద్యేయంగా , ప్రజల రక్షణే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడే అధికారులపై ఉక్కుపాదం మోపనున్నాడు. ఈ అవినీతిని నిర్ములించడానికే  14400 కాల్ సెంటర్‌ ని ఏర్పాటు చేసారు. రాష్ట్రంలోని ఏ జిల్లా , ఏ మూల నుండైనా కూడా ఈ నెంబర్ కి కాల్ చేసి ..వారి సమస్య ఏమిటో చెప్పవచ్చు. ఆలా ఫిర్యాదు ఇచ్చిన 15 రోజుల్లోనే వారి సమస్య పరిష్కారం అయ్యేలా సరికొత్త పథకాన్ని తీసుకువచ్చారు.

అయితే, సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన 14400 కాల్ సెంటర్‌కు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరు తమకి జరిగిన అన్యాయాల గురించి ఈ నెంబర్ కి కాల్ చేసి చెప్తున్నారు.  ప్రస్తుతం ఈ 14400 కాల్ సెంటర్‌కు గుంటూరు జిల్లా నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయట. అది కూడా.. అవినీతిపై.. అందులోనూ.. రెవెన్యూ, విద్యుత్, పురపాలక అధికారులపై ఎక్కువగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయట.

బర్త్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, భూ రిజిస్ట్రేట్స్, వాటర్ బిల్, కరెంట్ బిల్లు, ఇంటి పన్ను.. ఇలా అన్నీ కావాలంటే.. లంచం పెట్టనిదే పని జరగట్లేదని వారు అధికారులకి వివరిస్తునట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. రెవెన్యూ శాఖపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని కాల్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. అవినీతికి సంబంధించి.. మొత్తంగా 200లకు పైగానే.. కాల్స్ వచ్చాయట. అయితే.. ఈ వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా.. తగిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారట ఏసీబీ అధికారులు. ఈ కాల్స్ పై రంగంలోకి దిగిన అధికారులు..ఆ ఆరోపణలకు సంబంధించి  ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? వారి ఏ పని మీద ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు? ఏ అధికారి లంచం డిమాండ్ చేశారు..? తదితర విషయాలను ప్రజల నుంచి సేకరిస్తున్నారని సమాచారం. ఆలా వివరాలు సేకరించిన తరువాత నిజంగా ఆ అధికారి లంచం డిమాండ్ చేసాడు అని తెలిస్తే ..చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందట.
Tags:    
  • Ap 
  • Corruption District 
  • Andhra Pradesh Corruption 
  • First Place Of Ap Corruption 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఢిల్లీ వచ్చింది చాలు..పాక్ మంత్రికి భారత్ షాక్ !

2026-11-21 03:32 GMT

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

కొనేదంతా బంగారం కాదు...బిగ్ అలర్ట్ !

2026-11-21 03:31 GMT

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

2026-11-21 03:30 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS