ఆన్ లైన్ గేమింగ్ చట్టంలో ఏపీ సర్కార్ మార్పులు

Update: 2020-09-26 04:45 GMT
ఏపీ సర్కార్ ఆన్ లైన్ గేమింగ్ చట్టంలో సవరణలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పటికే  ఆన్ లైన్ రమ్మీ, జూదం, పేకాటలను నిషేధించిన సంగతి తెలిసిందే.. వాటిని ఏపీలో ఎవరు ప్రోత్సహించినా.. ఎక్కడైనా నిర్వహించినా.. ఆడినా రెండేళ్ల జైలు శిక్ష విధించేలా జగన్ సర్కార్ కఠిన నిబంధనలు పెట్టింది. భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యువత, స్కూలు పిల్లలు ఎక్కువగా రమ్మీకి అలవాటు పడుతున్నారు. భారీగా డబ్బులు పెట్టి ఆడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మోసపోయి డబ్బులు మొత్తం పోగొట్టుకుంటున్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రమ్మీ పేరిట జరుగున్న మోసాలు కూడా విచ్చలవిడిగా ఏపీలో నమోదవుతున్నాయి. ఎక్కువ మంది ఇందులో డబ్బులు పోగొట్టుకుంటున్నామని ఫిర్యాదు చేస్తున్నారు.

దీంతో ఏపీలో ఆన్ లైన్ రమ్మీని నిషేధించాలని ప్రభుత్వానికి డిమాండ్లు పెరిగాయి.దీంతో ఏపీ సర్కార్ తాజాగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Tags:    

Similar News