కేటీఆర్ ను ఆక్సీజన్ కోరిన ఏపీ వాసి.. మినిస్టర్ ఏం చేశాడంటే?
‘‘సర్.. మా దగ్గర పరిస్థితి దయనీయంగా ఉంది. 12 ఆక్సీజన్ సిలిండర్లు అత్యవసరం. దయచేసి స్పందించండి.’’ అని ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వాసి తెలంగాణ మంత్రి కేటీఆర్ ను అభ్యర్థించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశాడు ప్రసాద్ ఆకుల అనే వ్యక్తి.
విజయనగరం జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ప్రాణాపాయ స్థితిలో తమను ఆదుకోవాలని కోరాడు. కేటీఆర్ కు చేసిన ట్వీట్లో తన మొబైల్ నంబర్లను కూడా పోస్టు చేశాడుప్రసాద్ అనే వ్యక్తి. ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.
ఈ ట్వీట్ ను ఏపీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ కు ఫార్వార్డ్ చేశారు కేటీఆర్. వెంటనే బాధితులకు సహాయం చేయాలని కోరారు. కేటీఆర్ స్పందన పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వెంటనే స్పందించడం ద్వారా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నారని అభినందిస్తున్నారు. ఏపీలోని పలువురు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు తెలంగాణ సేఫ్ జోన్లో ఉంటుందని కూడా కొందరు కామెంట్లు చేశారు. అయితే.. మరికొందరు మాత్రం భిన్నంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోని జనం పరిస్థితి గురించి కూడా ఇదేవిధంగా స్పందిస్తే బాగుంటుందని కామెంట్ చేశారు. ఆక్సీజన్, మందులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు.