ఓటేసి.. అక్కడే బిడ్డకు జన్మనిచ్చిన సర్పంచ్
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో దశ ఎన్నికల పోలింగ్ వేళ ఆసక్తికరమైన ఘటన జరిగింది.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కలిదిండి మండలంలోని కోరుకల్లు గ్రామంలో పోలింగ్ జరిగింది. ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన లీలా కనకదుర్గ.. తన ఓటును వినియోగించుకున్న కాసేపటికే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డ జననం తమ అదృష్టం అంటూ కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే లీలా కనకదుర్గ నిండు గర్భిణీ. అంతలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మహిళా రిజర్వేషన్ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నామినేషన్ దాఖలు చేసింది.
గర్భణిగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. పోలింగ్ సందర్భంగా లీలా కనకదుర్గ తన ఓటు హక్కును వినియోగించడానికి పోలింగ్ కేంద్రానికి చేరింది. ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి.
దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు డెలివరీ చేయగా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.