జ‌గ‌న్ 2.0లో పొరుగు రాష్ట్రాల మ‌హిళ‌లు.. సీనియ‌ర్ల మ‌రో మెలిక‌!

Update: 2022-04-14 08:20 GMT
తాజాగా విస్త‌రించిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో చిత్ర విచిత్రాలు చాలానే ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన నాయ‌కులు త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని.. బాద‌ప‌డుతుంటే.. సీఎం జ‌గ‌న్ మాత్రం పొరుగు రాష్ట్రాల‌కు  చెందిన మ‌హిళా నాయ‌కుల‌కు ప‌దవులు క‌ట్ట‌బెట్టి.. పండ‌గ చేసుకోమంటున్నార‌ని.. సీనియ‌ర్లు ఆవేద‌న, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. జ‌గ‌న్ కేబినెట్ లోకి తీసుకున్న న‌లుగురు మ‌హిళా మంత్రుల్లో ఇద్ద‌రు ఏపీకి చెందిన(బై బ‌ర్త్‌)వారు కాక‌పోవ‌డాన్ని సీనియ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో తాము పార్టీ జెండా మోయ‌డానికి.. ప‌నికొస్తాం త‌ప్ప‌.. పార్టీ లో ప‌ద‌వుల‌కు అనర్హుల‌మా? అని త‌న అనుచ‌రుల వ‌ద్ద తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప‌ద‌వి ద‌క్కించుకున్న ప‌ల్నాడు జిల్లాలోని చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడదల రజని.. తెలంగాణ బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు.  సత్తయ్య బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.

రెండో కూతురు రజని రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త(రెడ్డి సామాజిక‌వ‌ర్గం)తో వివాహమైంది. ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య మంత్రిగా చోటు దక్కించుకున్నారు. అయితే.. ఇదే ప‌ని.. తెలంగాణలోని అధికార టీఆర్ ఎస్ చేస్తుందా?  అని వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. లేదా.. కేసీఆర్‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ర‌జ‌నీకి ప‌ద‌వి ఇచ్చారా? అని చ‌ర్చించుకుంటున్నారు.

ఇక‌, మ‌రో నాయ‌కురాలు.. ఉష శ్రీచ‌ర‌ణ్‌. అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆమెకు తాజా జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో మంత్రిగా అవ‌కాశం ల‌భించింది. అయితే.. ఈమె కూడా ఏపీకి చెందిన నాయ‌కురాలు కారు. క‌ర్ణాట‌క‌కు చెందిన బ‌ళ్లారిలో పుట్టి.. అక్క‌డే చ‌దువుకున్నారు. అయితే.. అనంత‌పురానికి చెందిన రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే అనంత‌పురం కోడ‌ల‌య్యారు.

అయితే.. ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ.. నెల‌లో 25 రోజులు ఆమె బెంగ‌ళూరు, బ‌ళ్లారిలోనే ఉంటున్నార‌ని. .ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. ఇదే విష‌యంపై వైసీపీ ఎంపీ.. రంగ‌య్య‌తోనూ ఆమెకు వివాదం ఉంది. కానీ, జ‌గ‌న్ ఇప్పుడు క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌హిళ‌కు మంత్రిప‌ద‌వి ఇచ్చార‌ని.. తాము ప‌నికిరాలేదా.. అని.. ఈ జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక‌వ ర్గం బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై సీఎం జ‌గ‌న్ కానీ, స‌జ్జ‌ల కానీ .. స్పందిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News