తెలంగాణ పురపోరులో భారీగా సింగిల్ ఓటు విజేతలు

పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి 366 ఓట్లు రాగా .. బీఆర్ఎస్ అభ్యర్థికి 368 ఓట్లు వచ్చాయి.;

Update: 2026-02-14 04:37 GMT

తెలంగాణ పురపోరులో వెల్లడైన ఫలితాల్లో ఆసక్తికర అంశాలకు కొదవలేదు. పలుచోట్ల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఒకే సంఖ్యలో ఓట్లురావటం.. లాటరీతోనూ.. టాస్ తోనూ విజేతగా డిసైడ్ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పలుచోట్ల హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు చివర్లో రీకౌంటింగ్ కు పట్టుబట్టి.. సింగిల్ ఓటుతో విజయాన్ని సొంతం చేసుకున్న వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. ఒక్కఓటుతో ప్రత్యర్థుల మీద విజయం సాధించిన వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి 366 ఓట్లు రాగా .. బీఆర్ఎస్ అభ్యర్థికి 368 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మూడు పోస్టల్ ఓట్లు రాగా.. అవన్నీ కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకే రావటంతో ఆమె ఒక ఓటుతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో.. రీకౌంటింగ్ జరపగా.. అందులోనూ సుభద్రనే విజయాన్ని సొంతం చేసుకున్నారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి465 ఓట్లురాగా.. బీఆర్ఎస్ అభ్యర్థికి 464 ఓట్లు వచచాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మను విజేతగా ప్రకటించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 18వవార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి 837 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థికి 836 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ లోనై ఇదే విధంగా రావటంతో కాంగ్రెస్ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు.

కొల్లాపూర్ మున్సిపాలిటీలోని రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థి కంటే ఒక్క ఓటు అధిక్యం రావటం.. రీకౌంటింగ్ లోనూ ఇదే ఫలితం రిపీట్ కావటంతో కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మిని విజేతగా ప్రకటించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థికి 229 ఓట్లు వస్తే.. బీజేపీ అభ్యర్థికి 161 ఓట్లు.. మజ్లిస్ అభ్యర్థికి ఒక్క ఓటు రావటం చూస్తే.. అన్ని ఓట్లలో రెండు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి పడినా.. ఫలితం మరోలాఉండేదన్న మాట వినిపించింది.

రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని 59వ వార్డులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఖాజాసనాకు.. ఏఐఎఫ్ బీ అభ్యర్థి బాలసాని తిరుపతికిసమానంగా ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లను పక్కన పెట్టిన నాలుగు ఓట్లను బయటకు పరిశీలించగా.. అందులో రెండు ఓట్లు చెల్లుబాటు అవుతాయని పరకటించారు. దీంతో ఏఐఎఫ్ బీ అభ్యర్థి తిరుపతి రెండు ఓట్ల తేడాతో విజేతగా నిలిచారు.

Tags:    

Similar News