వృద్ధుడి ‘ఆ కోరిక’తో బిత్తరపోయిన రోజా!

Update: 2022-05-17 12:40 GMT
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రస్తుతం గడపగడపకు మన ప్రభుత్వం పేరిట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నేతలు ఇంటింటికి తిరుగుతూ ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరిస్తున్నారు. ఈ మూడేళ్లలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందో వివరిస్తున్నారు. దీంతోపాటు సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన లేఖను, లబ్ధికి సంబంధించిన కరపత్రాన్ని ప్రజల చేతుల్లో పెడుతున్నారు.

చాలా నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. ఎన్నికలయిన మూడేళ్లకు తాము గుర్తొచ్చామా అని ప్రజలు నిలదీస్తున్నారు. తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు. వివిధ పథకాలు అందలేదని.. తాగునీరు లేదని.. ఇలా సమస్యలపై నేతలను నిలదీస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలకు చుక్కదెరు అవుతోంది.

అయితే.. పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాకు తన పర్యటనలో వింత అనుభవం ఎదురైంది. రోజా తన నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మే 17న నగరిలో పర్యటించిన మంత్రి రోజాకు ఓ వృద్ధుడి నుంచి వింత కోరిక ఎదురైంది.

మంత్రి రోజా ఓ వీధిలో పర్యటిస్తూ.. అందరినీ పలకరిస్తూ ఆయా పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఇంతలో ఓ వృద్ధుడు ఆమెకు సమీపంలోకి వచ్చాడు. రోజా అందరిలాగే ఆ వృద్ధుడిని కూడా కుశల ప్రశ్నలు వేశారు. వృద్ధాప్య పెన్షన్‌ వస్తుందా అని అడిగారు. దానికి వృద్ధుడు వస్తుందని సమాధానం ఇచ్చాడు. అయితే.. తనకు పెళ్లి కూడా చేయాలని కోరడంతో రోజా ముసిముసి నవ్వులు నవ్వారు. రోజా పక్కనున్నవారు కూడా వృద్ధుడి మాటలకు కడుపుబ్బా నవ్వారు.

వృద్ధుడి కోరికపై మంత్రి రోజా సమాధానమిస్తూ.. తాము పింఛన్‌ అయితే ఇవ్వగలం కానీ పెళ్లి చేయలేమని చెప్పారు. ఇంతలో ఆ వృద్ధుడికి మద్దతుగా మరికొంతమంది కూడా రోజాతో మాట్లాడారు. ఆయనకు పిల్లలు లేరని.. ఒంటరిగా ఉంటున్నాడని.. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పారు. దీంతో రోజా పెళ్లి విషయంలో తామేమీ చేయలేమని.. ప్రభుత్వ పథకాల విషయంలో అయితే సహాయం చేస్తామని బదులు ఇచ్చారు. దీంతో వృద్ధుడు నిరాశగా వెనుదిరిగాడు.

వృద్ధుడు రోజాతో మాట్లాడిన ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వృద్ధుడు మంత్రి రోజా దగ్గర కావాల్సిన కోరికే కోరాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News