ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కాంలో లోకేష్ అరెస్ట్ తప్పదా?

Update: 2020-06-12 05:00 GMT
ఫైబర్ గ్రిడ్. ఇంటింటికి తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించేందుకు చంద్రబాబు గద్దెనెక్కగానే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రారంభోత్సవం చేశారు. ఘనంగా చాటారు. కోట్లు కేటాయించారు. కానీ ఐదేళ్లు గడిచినా ఈ పథకం పూర్తి కాలేదు. అతీగతీ లేకుండా పోయింది. ఎక్కడా ఏపీలో ప్రజలకు ఇంటర్నెట్ అందడం లేదు. ఆ పథకం ఉన్నట్టు కూడా తెలియదు..

2017 డిసెంబర్ 27 .. బెజవాడలో జరిగిన ANU (ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్) శతాబ్ది వేడుకలు, ఫైబర్ గ్రిడ్ పథకం ప్రారంభోత్సవ బాధ్యతలు అన్నీ ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నాటి ఐటీశాఖ మంత్రి అయిన లోకేష్ ఆధ్వర్యంలోనే సాగాయి. ఈ సదస్సు మొత్తాన్ని తానే స్వయంగా పర్యవేక్షించాడు. దగ్గరుండి సూచనల, సలహాలు ఇచ్చాడు. రాష్ట్రపతి కోవింద్ కు కూడా దగ్గరుండి అన్నీ వివరించారు. ఇక లోకేష్ ప్రసంగం ఇంగ్లీష్ లో సాగింది. రాష్ట్రపతి స్వయంగా లోకేష్ చొరవ, నిర్వహణను వేదికపై మెచ్చుకున్న సంగతి తెలిసిందే.. ఈ ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకం మొత్తం నాటి ఐటీశాఖ మంత్రి లోకేష్ కనుసన్నల్లో జరిగింది.

చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద సంచలనం సృష్టించిన ఈ ఫైబర్ గ్రిడ్ పథకంలో అవినీతి జరిగిందని వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమానిస్తోంది. తాజాగా నిన్న జరిగిన కేబినెట్ భేటిలో ఏపీ ప్రభుత్వం దీనిమీద దృష్టి సారించినట్టు సమాచారం. ఈ మేరకు నిన్న ప్రెస్ మీట్ లో మంత్రి పేర్ని నాని కూడా ఇండైరెక్టుగా ఈ ఫైబర్ గ్రిడ్ స్కాంలో మాజీ మంత్రి లోకేష్ పాత్ర ఉందన్నట్టు సిగ్నల్స్ పరోక్షంగా ఇచ్చారు.  అన్నీ బయటకు తీస్తాం అన్నారు. ఈ ప్రకటన టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అచ్చెన్నాయుడును ఈ ఉదయం ఈఎస్ఐ స్కాం లో అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లోకేష్ ని కూడా ఈ ఫైబర్ గ్రిడ్ స్కాంలో అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ ను కూడా త్వరలోనే విచారిస్తారు అని అధికారవర్గాల్లో చర్చ మొదలైంది.
Tags:    

Similar News