రెడ్ బుక్ లో జగన్ పేరు....లోకేష్ షాకింగ్ కామెంట్స్
ఏపీలో పాలిటిక్స్ అయితే భీకరమైన పోరుగానే సాగుతోంది. రాజకీయంగా ప్రత్యర్ధులు స్థాయి నుంచి అపర శత్రువులు మాదిరిగా మారి అటూ ఇటూ మోహరించి రాజకీయం చేస్తున్నారు.;
ఏపీలో పాలిటిక్స్ అయితే భీకరమైన పోరుగానే సాగుతోంది. రాజకీయంగా ప్రత్యర్ధులు స్థాయి నుంచి అపర శత్రువులు మాదిరిగా మారి అటూ ఇటూ మోహరించి రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ బుక్ ప్రస్తావనను తరచూ వైసీపీ నేతలు తెస్తూ టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూంటే రెడ్ బుక్ అంటే భయం ఎందుకు అని కూటమి వైపు నుంచి కౌంటర్ పడుతోంది. అదే విధంగా రెడ్ బుక్ కి పోటీగా వైసీపీ కూడా డిజిటల్ బుక్ ని ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలేది లేదని వైసీపీ నేతలు అంటూంటే గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని వదిలేది లేదని కూటమి నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
జగన్ పేరు ఉంటే :
ఇదిలా ఉంటే ముంబైలో ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా - 2026' సదస్సులో నారా లోకేష్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఇదే నేపథ్యంలో రెడ్ బుక్ గురించి ప్రస్తావన వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పేర్లతో తాను రెడ్ బుక్ రూపొందించాను అని లోకేష్ చెప్పారు. అయితే ఆ రెడ్ బుక్ లో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు ఉందో లేదో తొందరలో తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలను లోకేష్ చేశారు. గత అయిదేళ్ళ కాలంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఎవరూ తప్పించుకోలేరంటూ :
రెడ్ బుక్ లో పేరు ఉన్న వారు ఎవరూ తప్పించుకోలేరని లోకేష్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు కానీ అలాగే వారిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులు కానీ అదే విధంగా తమ పార్టీ క్యాడర్ ని లీడర్స్ ని హింస పెట్టిన వారు కానీ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అన్నీ రెడ్ బుక్‌లో నమోదు చేశామని అన్నారు. వీరంతా స్తుచట్టం నుంచి అసలు తప్పించుకోలేరని లోకేష్ స్పష్టం చేశారు. తప్పు ఏసిన వారు ఎవరైనా ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని లోకేష్ హెచ్చరించారు. అయితే రెడ్ బుక్ లో వైఎస్ జగన్ పేరు ఉందా లేదా అన్న దానికి మాత్రం ఆయన సూటిగా జవాబు చెప్పకుండా అది తొందరలోనే తెలుస్తుంది అని వ్యాఖ్యానించి మరింత ఉత్కంఠ రేపారు.
రెడ్ బుక్ లో ఎన్నో పేజీలు :
ఆ మధ్య లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ లో ఇప్పటిదాకా పూర్తి అయినవి కేవలం మూడు పేజీలు మాత్రమే అని చెప్పారు. ఇంకా అనేక పేజీలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇపుడు చూస్తే ముంబై సందస్సులో మాట్లాడుతూ జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది అని అంటున్నారు. దీంతో రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందా ఉంటే ఆయన మీద ఏ కేసులలో అన్నది కూడా చర్చగా ఉంది. రెడ్ బుక్ లో జగన్ ని అరెస్ట్ చేస్తారా అన్నది కూడా సరికొత్త రాజకీయ చర్చగా ముందుకు వస్తోంది. మొత్తం మీద చూస్తే ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది అని చెప్పాలి.