టీడీపీ సీనియర్లకు మంత్రి యోగం ?

తెలుగుదేశం పార్టీ కూటమిని నాయకత్వం వహిస్తోంది. మిత్రులతో పాటు సొంత పార్టీ వారికి పదవులు పంచుతూ అంతటా కో ఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.;

Update: 2026-02-28 06:30 GMT

తెలుగుదేశం పార్టీ కూటమిని నాయకత్వం వహిస్తోంది. మిత్రులతో పాటు సొంత పార్టీ వారికి పదవులు పంచుతూ అంతటా కో ఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సీనియర్లకు కొందరికి సరైన అవకాశాలు దక్కలేదు, దాంతో వారు అసంతృప్తి చెందుతున్నారు. సీనియర్ నేతలుగా ఉంటున్నా పూర్వం మాదిరిగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. మంత్రి పదవి ఇస్తే కనుక వారు జిల్లా రాజకీయాలను శాసించడమే కాదు కూటమిని ప్రభుత్వాన్ని మరింతగా బలోపేతం చేస్తారు అని అంటున్నారు. కూటమి పాలన కావడం మిత్రులకు పదవులు కట్టబెట్టడం ఇతర ఈక్వేషన్స్ వల్ల సీనియర్లకు అవకాశాలు ఇప్పటిదాకా రాలేదని అంటున్నారు. అయితే ఇపుడు టీడీపీ సీనియర్ల గురించి సీరియస్ గానే ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ముగ్గురి మీద ఫోకస్ :

ఉత్తరాంధ్రాలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్న విశాఖ విజయనగరం శ్రీకాకుళంలలో సీనియర్లు అంతా పార్టీకి వీర విధేయులై దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఇపుడు వారిని మరింతగా ప్రోత్సహించాలని పదవులు కట్టబెట్టాలని పార్టీ పరంగా సమాలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా సామాజిక సమతూకాన్ని సైతం పాటించబోతున్నారు. దాంతో ఉత్తరాంధ్రలో ముగ్గురు సీనియర్లు అయిన గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడికి కీలక బాధ్యతలను అప్పగించాలని పార్టీ ఒక విధంగా డిసైడ్ అయింది అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

ఏపీ ప్రెసిడెంట్ గా :

ఇక చూస్తే కనుక అచ్చెన్నాయుడు 2020లో టీడీపీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన ఈ పదవిలో ఉండగానే టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. అచ్చెన్నాయుడు టీడీపీ ప్రెసిడెంట్ గా దూకుడుగా వ్యవహరించారు అని అంతా అంటున్నారు. ఆయన వైసీపీ మీద గట్టిగా మాట్లాడుతారు. ఏ ఒక్క ఇష్యూని వదిలేయకుండా డిఫెన్స్ లో ఆ పార్టీని పెడతారు అని కూడా పేరు ఉంది. అందుకే అచ్చెన్నాయుడికే మరోసారి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెడతారు అని అంటున్నారు. ఆయన మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ శాఖను చూస్తున్నారు. అయితే ఆ జిల్లాలో కింజరాపు కుటుంబానికే రెండు మంత్రి పదవులు ఉన్నాయి. దాంతో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడుని కొనసాగించి అచ్చెన్నకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.

వీరిద్దరికీ పదవులు :

ఇక గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. భీమిలీ నుంచి 90 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలిచిన గంటా అంగబలం అర్ధ బలం కలిగిన నాయకుడు, వ్యూహ చతురుడు, ఆయనకు మంత్రి పదవి ఇస్తే విశాఖ జిల్లాలో పార్టీ మరింతగా బలపడుతుందని అంచనా వేస్తున్నారుట. అంతే కాదు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు రాష్ట్రంలో ఆ సామాజిక వర్గంలో గుర్తింపు ఉన్న నేతగా ఉన్నారు. దాంతో గంటాకు మంత్రి యోగం ఉందని అంటున్నారు. అలాగే యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. అయితే ఆయన సాఫ్ట్ నేచర్ వల్ల అనుకున్నంతగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు. అంతే కాదు మంత్రి పదవిని ఆయన కోరుకుంటున్నారు అని అంటున్నారు. దాంతో పల్లా కోరిక తొందరలోనే తీర్చాలని హైకమాండ్ ఫిక్స్ అయింది అని అంటున్నారు. ఉగాది తరువాత తీపి కబురు తమ్ముళ్ళకు అందుతుందని అంటున్నారు.

Tags:    

Similar News